Apple: ఎం3 ప్రాసెసర్లు, మ్యాక్‌బుక్‌ ప్రో, 24 inch ఐమ్యాక్‌.. యాపిల్‌ లాంచ్‌ చేసిన కొత్త ఉత్పత్తులివే!

Apple: స్కేరీ ఫాస్ట్‌ పేరిట యాపిల్‌ మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. దీంట్లో ఎం3 చిప్‌లతో పాటు కొత్త మ్యాక్‌బుక్‌ ప్రోలు, ఐమ్యాక్‌ను విడుదల చేసింది.

Updated : 31 Oct 2023 14:23 IST

Apple | క్యూపర్టినో: టెక్‌ దిగ్గజం యాపిల్‌ (Apple) కొత్త ఎం3 సిరీస్‌ ప్రాసెసర్ల (M3 chips)ను తీసుకొచ్చింది. అలాగే నూతన మ్యాక్‌బుక్‌ ప్రో (MacBook Pros), 24 అంగుళాల ఐమ్యాక్‌ (iMac)నూ ప్రవేశపెట్టింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున జరిగిన ‘స్కేరీ ఫాస్ట్‌’ కార్యక్రమంలో వీటిని విడుదల చేసింది.

మూడు కొత్త ఎం3 చిప్‌లు..

యాపిల్‌ ఎం3 సిరీస్‌లో మూడు కొత్త చిప్‌ (M3 chips)లను తీసుకొచ్చింది. ఎం3, ఎం3 ప్రో, ఎం3 మ్యాక్స్‌ పేరిట వీటిని ప్రవేశపెట్టింది. 3 నానోమీటర్‌ ఆర్కిటెక్చర్‌పై వీటిని రూపొందించారు. కొత్త జీపీయూ మైక్రోఆర్కిటెక్చర్‌, డైనమిక్‌ మెమొరీ క్యాచింగ్‌, అలకేషన్‌ సిస్టమ్‌తో తీసుకొచ్చారు. జీపీయూ వినియోగాన్ని మెరుగుపర్చేలా మార్పులు చేసినట్లు యాపిల్‌ (Apple) తెలిపింది. మెష్‌ షేడింగ్‌, రే ట్రేసింగ్‌ వంటి కొత్త ఫీచర్లు ఉన్నట్లు వెల్లడించింది. ఎం2తో పోలిస్తే 1.8 రెట్లు, ఎం1తో పోలిస్తే 2.5 రెట్ల వేగంతో పనిచేస్తాయని చెప్పింది. పెర్ఫార్మెన్స్‌ కోర్స్‌ ఎం2 కంటే 15 శాతం, ఎఫీషియెన్సీ కోర్స్‌ 30 శాతం వేగంగా ఉంటాయని పేర్కొంది.

M3: 8-కోర్‌ CPU, 10-కోర్‌ GPU, 25 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు.

M3 Pro: 12 CPU కోర్స్‌, 18 GPU కోర్స్‌, 37 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు.

M3 Max: 16 CPU కోర్స్‌, 40 GPU కోర్స్‌, 92 బిలియన్‌ ట్రాన్సిస్టర్లు.

14", 16" మ్యాక్‌బుక్‌ ప్రోలు..

కొత్త మ్యాక్‌బుక్‌ ప్రో (MacBook Pros) సిరీస్‌ను సైతం యాపిల్‌ లాంచ్‌ చేసింది. వీటిని కొత్త ఎం3 సిరీస్‌ చిప్‌లతో తీసుకొచ్చింది. ఫలితంగా CPU, GPU పెర్ఫార్మెన్స్‌ మెరుగుపడినట్లు కంపెనీ తెలిపింది. తొలిసారి ఈ లైనప్‌లో 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రోను కూడా తీసుకొచ్చింది. దీంతో మ్యాక్‌బుక్‌ ప్రోలు ఇటు 14 అంగుళాలతో పాటు 16 అంగుళాల పరిమాణంలోనూ లభించనున్నాయి. పైగా ఇవన్నీ మూడు కొత్త ఎం3 ప్రాసెసర్ల వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. దీంతో ఇక 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో నిలిచిపోనుంది.

ఎం3 మ్యాక్స్‌ చిప్‌తో వచ్చే మ్యాక్‌బుక్‌ ప్రో (MacBook Pro) 128జీబీ ర్యామ్‌ వరకు సపోర్ట్‌ చేస్తుందని యాపిల్‌ తెలిపింది. బ్యాటరీ లైఫ్‌ 22 గంటల వరకు ఉంటుందని పేర్కొంది. ప్లగ్‌ఇన్‌లో ఉన్నా.. లేదా బ్యాటరీపై నడుస్తున్నా మ్యాక్‌ ఒకే విధమైన పెర్ఫార్మెన్స్‌ ఇస్తుందని తెలిపింది. డిజైన్‌లో మాత్రం పెద్దగా మార్పులు చేయలేదు. కానీ, కొత్తగా నలుపు రంగులోనూ మ్యాక్‌బుక్‌ ప్రో లభించనుంది.

14-అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో ధరలు..

  • M3 512GB - ₹1,69,900
  • M3 1TB - ₹1,89,900
  • M3 Pro 512GB - ₹1,99,900
  • M3 Pro 1TB - ₹2,39,900
  • M3 Max 1TB -  ₹3,19,900

16 అంగుళాలు..

  • M3 Pro 512GB & 18GB -  ₹2,49,900
  • M3 Pro 512GB & 36GB - ₹2,89,900
  • M3 Max 1TB & 36GB - ₹3,49,900
  • M3 Max 1TB & 48GB - ₹3,99,900

24 అంగుళాల ఐమ్యాక్‌..

ఈ ‘స్కేరీ ఫాస్ట్‌’ కార్యక్రమంలోనే యాపిల్‌ కొత్త 24 అంగుళాల ఐమ్యాక్‌ (iMac)ను కూడా ప్రవేశపెట్టింది. డిజైన్‌ విషయంలో పాత ఐమ్యాక్‌ల తరహాలోనే ఉంది. డిస్‌ప్లేను సైతం అలాగే ఉంచారు. 4.5కే రిజల్యూషన్‌, 1080పీ కెమెరా, స్పీకర్లు, మైక్‌లు, యూఎస్‌బీ పోర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీన్ని కూడా ఎం3 చిప్‌తో తీసుకొచ్చారు. ప్రీఆర్డర్లు నేటి నుంచే ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 7 నుంచి కస్టమర్ల చేతికి అందుతాయి.

M3 చిప్‌ 24" iMac ధరలు..

  • 8GB, 256GB, 8 core GPU - ₹1,34,900
  • 8GB, 256GB, 10 core GPU - ₹1,54,900
  • 8GB, 512GB, 10 core GPU - ₹1,74,900

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని