రక్షణ.. పెట్టుబడి ఒకే పాలసీలో

బీమా రక్షణ, పెట్టుబడికి అవకాశాన్ని ఒకే పాలసీలో కల్పిస్తూ కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. టర్మ్‌, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లను కలిపి టియులిప్‌ను ప్రారంభించింది.

Published : 12 Jan 2024 05:45 IST

బీమా రక్షణ, పెట్టుబడికి అవకాశాన్ని ఒకే పాలసీలో కల్పిస్తూ కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. టర్మ్‌, యూనిట్‌ ఆధారిత బీమా పాలసీ (యులిప్‌)లను కలిపి టియులిప్‌ను ప్రారంభించింది. వార్షిక ప్రీమియానికి 100 రెట్ల వరకూ బీమా రక్షణ కల్పించడం ఈ పాలసీ ప్రత్యేకత. అదే సమయంలో ఫండ్లలోనూ మదుపు చేస్తుంది. 10, 11, 12, 13 పాలసీ సంవత్సరాల్లో ప్రీమియం కేటాయింపు ఛార్జీలను రెండు రెట్ల వరకూ వెనక్కి తిరిగి ఇస్తుంది. 11 పాలసీ ఏడాది నుంచి బీమా మోర్టాలిటీ రుసుములో 1 నుంచి 3 రెట్ల వరకూ తిరిగి ఇస్తుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా డబ్బును వెనక్కి తీసుకునే వీలూ ఉంటుంది. పాలసీదారులు యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌, క్రిటికల్‌  ఇల్‌నెస్‌ రైడర్లనూ ఎంపిక చేసుకోవచ్చు.  మదుపు చేసేందుకు 8 రకాల ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. పాలసీదారుల ఇష్టానుసారం వీటిని ఎంచుకునే వీలు  కల్పిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని