పెద్ద, మధ్య స్థాయి కంపెనీల్లో..

పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. పీజీఐఎం ఇండియా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చేనెల 7. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం.

Published : 26 Jan 2024 00:14 IST

పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. పీజీఐఎం ఇండియా లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చేనెల 7. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ప్రధానంగా లార్జ్‌, మిడ్‌క్యాప్‌ తరగతులకు చెందిన కంపెనీలతో పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తుంది. తద్వారా దీర్ఘకాలంలో అధిక లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ఇప్పటికే అందుబాటులో ఉన్న వివిధ సంస్థలకు చెందిన లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌ గత రెండేళ్లుగా అధిక లాభాలను నమోదు చేసిన విషయం గమనార్హం. దీన్ని పరిగణనలోకి తీసుకొని, ఇదే తరగతికి చెందిన కొత్త పథకాన్ని పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ‘నిఫ్టీ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌’ను ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.


రాబడి హామీతో.. పింఛను

దవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా పింఛను రావాలని కోరుకునే వారికోసం సరికొత్త యాన్యుటీ పథకాన్ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రు. గ్యారంటీడ్‌ పెన్షన్‌ ప్లాన్‌ ఫ్లెక్సీ విత్‌ బెనిఫిట్‌ ఎన్‌హాన్సర్‌’ పాలసీ తీసుకున్నప్పటి నుంచి ఏ రోజునైనా సరే మొత్తం 100 శాతం ప్రీమియాన్ని వెనక్కి ఇచ్చేలా దీన్ని రూపొందించారు. యాన్యుటీ పాలసీల్లో ఈ తరహా తొలి పాలసీ తమదేనని సంస్థ పేర్కొంది. పాలసీదారు జీవితాంతం వరకూ, మరణించిన తర్వాత జీవిత భాగస్వామి, పిల్లలు తదితరులకు పింఛను వచ్చే ఏర్పాటూ చేయొచ్చు. పాలసీ నుంచి వ్యవధిలోపే నిష్క్రమించినప్పుడూ సరైన స్వాధీన విలువను తిరిగి పొందేందుకు వీలుగా ఐఆర్‌డీఏఐ నిబంధనలు మార్చింది. దీనికి అనుగుణంగానే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పేర్కొంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్వేచ్ఛ కోసం యాన్యుటీ పాలసీలు ఉపయోగపడతాయని సంస్థ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ అమిత్‌ పల్టా తెలిపారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు, ఇతర అవసరాల నేపథ్యంలో కచ్చితమైన రాబడి వచ్చే ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


ప్రీమియం తిరిగి వచ్చేలా...

రోగ్య బీమా పాలసీ తీసుకున్న వారు ఎలాంటి క్లెయిమూ చేయకపోతే.. 100 శాతం ప్రీమియాన్ని వివిధ ప్రయోజనాల రూపంలో వెనక్కి అందించే వినూత్న పాలసీని ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తెచ్చింది. ‘యాక్టివ్‌ వన్‌’ పేరుతో తీసుకొచ్చిన ఇందులో వెనక్కి ఇచ్చిన ప్రీమియాన్ని పాలసీ పునరద్ధరణ కోసం లేదా ఔట్‌ షేషెంట్‌ చికిత్స ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చు. గది అద్దె, ఐసీయూ తదితరాలపై ఎలాంటి ఉప పరిమితులూ ఉండవు. పాలసీ విలువ పూర్తయిన వెంటనే మళ్లీ ఆ మేరకు భర్తీ అయ్యేలా సూపర్‌ రీలోడ్‌ అవకాశం ఉంది. వైద్య ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా పాలసీ తీసుకున్న ఆరేళ్లలో పాలసీ విలువ ఆరు రెట్ల వరకూ పెరిగేలా సూపర్‌ క్రెడిట్‌ ఆప్షన్‌ కల్పిస్తోంది. దీనికోసం ఎలాంటి అదనపు ప్రీమియం అవసరం లేదని చెబుతోంది. ఈ పాలసీకి వ్యక్తిగత ప్రమాద, క్రిటికల్‌ ఇల్‌నెస్‌, క్యాన్సర్‌ బూస్టర్‌లాంటి అనుబంధ పాలసీలను జోడించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని