Credit Card: పరిమితంగా వాడితేనే..

ఇటీవలి కాలంలో బ్యాంకులు క్రెడిట్‌ స్కోరు అధికంగా ఉన్నవారికే రుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వడ్డీ రేట్లలో రాయితీలు ఇవ్వాలన్నా క్రెడిట్‌ స్కోరు అవసరం

Updated : 15 Dec 2023 02:50 IST

ఇటీవలి కాలంలో బ్యాంకులు క్రెడిట్‌ స్కోరు అధికంగా ఉన్నవారికే రుణాలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వడ్డీ రేట్లలో రాయితీలు ఇవ్వాలన్నా క్రెడిట్‌ స్కోరు అవసరం. క్రెడిట్‌ కార్డులు వాడేవారు అధిక స్కోరు కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. చిన్న తేడా వచ్చినా మొత్తం చరిత్ర దెబ్బతింటుంది.

 క్రెడిట్‌ కార్డు బిల్లులు, రుణ వాయిదాలను ఎప్పుడూ సకాలంలో చెల్లించాలి. ఇదే మీ స్కోరును పెంచేందుకు ఉపయోగపడే తొలి విషయం. ఒక్క రోజు ఆలస్యం జరిగినా స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.
చాలామంది తమ క్రెడిట్‌ కార్డును పరిమితికి మించి వాడేస్తుంటారు. ఇది సరికాదు. ఎప్పుడూ ఇలాగే చేస్తుంటే మీరు రుణాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారనే అంచనాకు రుణదాతలు వస్తారు. దీంతో కొత్తగా అప్పు లభించడం కష్టమవుతుంది.
క్రెడిట్‌ కార్డు పరిమితి ఎంతుందో చూసుకోండి. అందులో కనీసం 30 శాతానికి మించి వాడకుండా ఖర్చు చేయాలి. మరీ అవసరమైతేనే 40 శాతం వరకూ వినియోగించాలి. తక్కువ పరిమితితో ఉన్న కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు మీ దగ్గర రూ.20వేల పరిమితితో కార్డు ఉందనుకోండి.. అందులో రూ.10వేలు వాడితే.. 50 శాతం వాడినట్లే. అప్పుడు మీరు అధికంగా కార్డును వాడుతున్నట్లు లెక్కిస్తాయి క్రెడిట్‌ బ్యూరో సంస్థలు.

  •  రెండు లేదా మూడు కార్డులకు మించి తీసుకోకపోవడమే ఉత్తమం. అధికంగా కార్డులుంటే.. నిర్వహణ కష్టం. ఒక్క బిల్లు మర్చిపోయినా స్కోరు దెబ్బతింటుంది.
  •  మీ అవసరానికి మించి కార్డులతో కొనుగోళ్లు చేయొద్దు. కనీస మొత్తం చెల్లించే అవకాశం ఉంటుంది. దీన్ని కేవలం ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడుకోవాలి. ప్రతిసారీ కనీస మొత్తమే చెల్లిస్తే.. వడ్డీ భారం పడుతుంది. రుణ చరిత్రా దెబ్బతింటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని