Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈ ఫీచర్‌తో మీ ఇంధనం ఆదా!

Google Maps: గూగుల్‌ మ్యాప్స్‌ మరో కొత్త అప్‌డేట్‌తో యూజర్ల ముందుకొచ్చింది. ప్రయాణ సమయాల్లో ఇంధనం ఆదా చేయటానికి ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది.

Updated : 14 Dec 2023 18:37 IST

Google maps | ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటివరకు రూట్‌ తెలుసుకోవడానికి, షార్ట్‌కట్‌ల కోసం, వేగం తెలుసుకోవడానికి ఉపయోగపడే గూగుల్‌ మ్యాప్స్‌ (Google Maps) ఇకపై ఇంధనాన్ని ఆదా చేయడంలోనూ సాయపడనుంది. ప్రయాణ సమయంలో ఇంధనాన్ని ఆదా చేయడం కోసం గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్యూయెల్​సేవింగ్’ పేరుతో ఈ ఫీచర్‌ని యూజర్లకు పరిచయం చేసింది. ఇప్పటికే అమెరికా, ఐరోపా, కెనడాలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ తాజాగా భారత్‌కూ తీసుకొచ్చింది.

గూగుల్‌ మ్యాప్స్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌ని ఎనేబల్‌ చేసుకుంటే.. లైవ్‌ ట్రాఫిక్‌ అప్‌డేట్లు, రహదార్లు, ట్రాఫిక్‌ పరిస్థితులతో పాటు ఇంధన సామర్థ్యంపై అంచనా వేస్తుంది. వాహన వేగం, ఇంధన వినియోగం రెండింటినీ పరిగణలోకి తీసుకొని అందుకు అనుకూలమైన మార్గాన్ని చూపుతుంది. ఎంచుకున్న మార్గం ఆధారంగా ఎంత మేరకు ఇంధనం ఖర్చవుతుందో తెలియజేస్తుంది. దీంతో ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

19 నుంచి హ్యాపీ ఫోర్జింగ్స్‌ ఐపీఓ.. పూర్తి వివరాలు ఇవే..!

ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలంటే.. గూగుల్‌ మ్యాప్స్ యాప్‌ని ఓపెన్ చేసి ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి. అందులో ‘Settings’లోకి వెళ్లి ‘Navigation settings’ని ఎంచుకొని కిందకు స్క్రోల్ చేయగానే ‘Route options’ అనే ట్యాబ్‌ కనిపిస్తుంది. అందులో ‘Prefer fuel-efficient routes’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత మీ వాహన ఇంజిన్‌, ఇంధనం రకాల్ని ఎంచుకోవాలి. అలాగే నావిగేషన్‌ ట్యాబ్‌లోనే టోల్‌ ధర, స్పీడోమీటర్‌ వంటి ఆప్షన్లు కూడా యూజర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఫీచర్ల ద్వారా వాహన వేగాన్ని తెలుసుకోవడంతో పాటు ఆ రూట్లో టోల్‌ ఛార్జీలు ఎంత చెల్లించాలో కూడా చూపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని