HDFC Bank: రెండు ఎఫ్‌డీలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వడ్డీ తగ్గింపు

HDFC Bank: ప్రముఖ ప్రైవేటురంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

Published : 03 Oct 2023 15:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ప్రైవేటురంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) రెండు ప్రత్యేక ఎఫ్‌డీలపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD) పథకాలపై వడ్డీ రేట్లను 5 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించింది. 35 నెలలు ఎఫ్‌డీపై సాధారణ డిపాజిటర్లకు అందించే వడ్డీని 7.20% నుంచి 5 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం ఈ కాలవ్యవధితో చేసే డిపాజిట్లపై 7.15% శాతం మాత్రమే వడ్డీని మాత్రమే ఇకపై చెల్లించనుంది. అలాగే, 55 నెలలు కాలవ్యవధితో ఉండే ఎఫ్‌డీపై అందించే వడ్డీని 7.20%కి తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

భారత వృద్ధి 6.3%.. ప్రపంచబ్యాంక్‌ వెల్లడి.. ద్రవ్యోల్బణ అంచనాలు పెంపు

ఇక మిగిలిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలపై వడ్డీ రేట్లు యథాథంగా కొనసాగనుంది. ప్రస్తుతం ఏడాది నుంచి 15 నెలల కాలం మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 6.60% వడ్డీని అందిస్తోంది. అదే సీనియర్‌ సిటిజన్లకు 50 బేసిస్‌ పాయింట్లు అధికంగా  7.10% వడ్డీని ఇస్తోంది. రెండేళ్ల ఒక రోజు నుంచి 2 సంవత్సరాల 11 నెలల కాలవ్యవధి డిపాజిట్లపై సాధారణ డిపాజిటర్లకు 7.00%, సీనియర్‌ సిటిజన్లకు 7.50% వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. మూడు సంవత్సరాల ఒక రోజు నుంచి 4 ఏళ్ల 7 నెలల కాల వ్యవధికి గానూ 7.00%, సీనియర్‌ సిటిజన్లకు 7.50% వడ్డీని ఇస్తోంది. ఐదు సంవత్సరాల ఒకరోజు నుంచి 10 ఏళ్ల మధ్య మెచ్యూర్‌ అయ్యే ఎఫ్‌డీలపై సాధారణ డిపాజిటర్లకు 7.00%, సీనియర్‌ సిటిజన్లకు 7.75% వడ్డీని ఇస్తోంది. రూ.2 కోట్లలోపు డిపాజిట్లకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని