Credit cards: కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులతో లాభమేనా?

credit cards: కో-బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డులు అంటే ఏంటి? వీటిని ఏ విధంగా ఉపయోగిస్తే ప్రయోజనకరం?

Published : 12 Sep 2023 14:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రెడిట్‌ కార్డుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పటిలా కాకుండా సులువుగా బ్యాంకులు జారీ చేస్తుండటంతో పాటు క్యాష్‌బ్యాక్‌, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు ఉండటంతో వీటిని వినియోగించే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ క్రమంలో తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొన్ని సంస్థలు.. బ్యాంకులు/ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తున్నాయి. ఇంతకీ ఇవి తీసుకోవడం వల్ల ఎంత వరకు ప్రయోజనం?

అసలు కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డు అంటే..

మారుతున్న పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో అనేక రకాల క్రెడిట్‌ కార్డులు వస్తుంటాయి. అయితే, సాధారణ క్రెడిట్‌ కార్డుల కంటే అదనపు ప్రయోజనాలు అందించేవే ఈ కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డులు. నిర్దిష్ట బ్రాండ్లు, వ్యాపారాలు, రిటైలర్లు, సర్వీస్‌ ప్రొవైడర్లు.. ఇలా మొదలైన వాటితో కలసి (టై-అప్‌తో) వీటిని తీసుకొని వస్తాయి. ఇవి తమ అనుబంధ బ్రాండ్‌లతో చేసిన లావాదేవీల కోసం ఈఎంఐ (EMI)లపై తక్కువ వడ్డీ, ప్రాసెసింగ్ రుసుములపై రాయితీ అందిస్తాయి. మీ అలవాట్లకు సరిపోయే కార్డును ఉపయోగిస్తే సాధారణ క్రెడిట్‌ కార్డు కంటే అదనంగా రివార్డు పాయింట్లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు పొందుతారు.

నేడే యాపిల్‌ ఈవెంట్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌తో పాటు ఏమేం రాబోతున్నాయ్‌..?

ప్రయోజనాలు..

  • కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ఉపయోగించి లావాదేవీలు చేసే వారు ఇచ్చిన మైలురాయిని చేరుకుంటే వార్షిక రుసుము మినహాయింపు పొందొచ్చు. పైగా మైలు స్టోన్‌ రివార్డు పాయింట్ల కింద అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. 
  • కోబ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు సూచించిన మర్చంట్స్‌ నుంచి నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే తక్కువ వడ్డీకి రుణాల్ని అవి అందిస్తాయి.
  • కో బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డులను కొత్తగా తీసుకున్న వారికి వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద షాపింగ్‌ కూపన్లు, డిస్కౌంట్లు అవి అందిస్తాయి.

ఎలాంటి కార్డు ఎంచుకోవాలి?

ఏదైనా క్రెడిట్‌ కార్డును ఎంచుకునే ముందు మీరు దేనిపై డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో తెలుసుకోండి. మీ ఖర్చుకు తగిన కో బ్రాండెండ్‌ క్రెడిట్‌ కార్డును ఎంచుకోండి.  ఫీచర్లు, రుసుములు, వడ్డీ రేట్లు, ఆఫర్లు, రివార్డ్‌ పాయింట్లు వంటి ప్రయోజనాలతో సరిపోల్చండి. మల్టిపుల్ బ్రాండ్ల అనుసంధానంతో తీసుకొచ్చిన క్రెడిట్‌ కార్డులను ఎంచుకోవటం ఉత్తమం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని