Whatsapp: వ్యాపారుల కోసం వాట్సప్‌లో కొత్త ఫీచర్స్‌

WhatsApp new features for businesses: భారత్‌లోని వ్యాపారుల కోసం వాట్సప్‌ కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది. ముంబయిలో జరిగిన కార్యక్రమంలో వీటిని ప్రకటించింది.

Updated : 20 Sep 2023 15:07 IST

WhatsApp new features | ముంబయి: భారత్‌లో వ్యాపారుల కోసం వాట్సప్‌ (Whatsapp) మాతృ సంస్థ మెటా (Meta) కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ముంబయిలో జరిగిన మెటా రెండో వార్షిక సమావేశంలో ఈ టూల్స్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Zuckerberg) వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్‌లోని ప్రజలు, వ్యాపారులు వాట్సప్‌ను సమర్థంగా వినియోగించి పనులు చక్కబెట్టుకొంటున్నారని కొనియాడారు. ఈ విషయంలో భారత్‌ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మెటా తీసుకొచ్చిన కొత్త వాట్సప్‌ ఫీచర్లను జుకర్‌బర్గ్‌ పరిచయం చేశారు. మెటా వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌, వాట్సప్‌ చాట్‌లోనే పేమెంట్‌ను సైతం పూర్తి చేసే సదుపాయం తీసుకొస్తున్నట్లు జుకర్‌బర్గ్‌ తెలిపారు. అలాగే కొత్తగా వాట్సప్‌లో ‘ఫ్లోస్‌’ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సదుపాయం ద్వారా చాట్‌ థ్రెడ్స్‌లోనే వినియోగదారులకు కావాల్సిన సేవలను అందించొచ్చని పేర్కొన్నారు.

జియో ఎయిర్‌ఫైబర్‌ వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇవిగో..

వాట్సప్‌ ఫ్లోస్‌ ద్వారా ఒక బ్యాంక్‌ తమ కస్టమర్‌కు అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటు, బ్యాంక్‌ అకౌంట్‌ను తెరిచే సదుపాయం కూడా అందించొచ్చని జుకర్‌బర్గ్‌ తెలిపారు. అలాగే ఫుడ్‌ డెలివరీ సర్వీసు రెస్టారెంట్‌ నుంచి ఎంపిక చేసిన ఫుడ్‌ను ఆర్డర్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విమానయాన టికెట్‌ బుకింగ్‌తో పాటు సీట్లను ఎంపిక చేసుకునే సదుపాయాన్ని వాట్సప్‌లోనే అందించొచ్చని తెలిపారు. ఇవేవీ చాట్‌ థ్రెడ్‌ నుంచి బయటకు వెళ్లకుండా పూర్తి చేయొచ్చని చెప్పారు. వ్యాపారుల కోసం మెటా వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ను రాబోయే నెలల్లో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని