India GDP: ఈ ఏడాది జీడీపీ 7.3%.. కేంద్రం అంచనా

India GDP: ప్రస్తుత భారత్‌ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి నమోదు కావొచ్చని కేంద్రం అంచనా కట్టింది. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం అంచనాలను వెలువరించింది.

Published : 05 Jan 2024 21:31 IST

India GDP | దిల్లీ: దేశయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను కేంద్ర గణాంక కార్యాలయం (NSO) వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) స్థూల దేశీయోత్పత్తి (GDP) 7.3 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా వేసింది. గతేడాది వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. జీడీపీకి సంబంధించి తొలి అంచనాలను ఈ మేరకు శుక్రవారం వెలువరించింది.

  • వాస్తవ జీడీపీ లేదా స్థిర ధరల (2011-12) వద్ద జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.171.79 లక్షల కోట్లుగా నమోదు కావొచ్చని ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. 2022-23లో ఇది రూ.160.06 లక్షల కోట్లుగా ఉంది.
  • ప్రస్తుత ధరల వద్ద నామమాత్రపు జీడీపీ రూ.296.58 లక్షల కోట్లుగా నమోదు కావొచ్చని ఎన్‌ఎస్‌ఓ అంచనా కట్టింది. 2022-23లో ఇది రూ.272.41 లక్షల కోట్లుగా ఉంది. ఆర్‌బీఐ సైతం ఈ ఏడాది 7 శాతం వృద్ధి నమోదు కావొచ్చని గతేడాది డిసెంబర్‌లో వెలువరించిన అంచనాల్లో పేర్కొంది. 6.5 శాతం మేర నమోదు కావొచ్చని తొలుత అంచనా వేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని