Two Wheeler Loans: ద్విచ‌క్ర వాహ‌న రుణాల‌కు వివిధ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు

ద్విచక్ర వాహ‌నాన్ని రుణంపై కొనుగోలు చేస్తున్న‌ప్పుడు క్రెడిట్ స్కోరు కూడా ముఖ్య‌మైన‌ది.

Updated : 20 Sep 2022 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు పెరిగినప్ప‌టికీ సొంత ప్ర‌యాణాలు త‌గ్గ‌డం లేదు. ద్విచ‌క్ర వాహ‌నాల అమ్మ‌కాలు కూడా విప‌రీతంగా పెరుగుతున్నాయి. ఆగ‌స్టులో దేశంలో దాదాపు 17.46 ల‌క్ష‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల అమ్మ‌కాలు జ‌రిగాయి. ద్విచ‌క్ర వాహ‌నాల‌కు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు విరివిగా రుణాలు అంద‌జేయ‌డం కూడా అమ్మ‌కాల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైంది. ప్ర‌ముఖ బ్యాంకుల్లో ద్విచ‌క్ర వాహ‌న రుణాల వ‌డ్డీ రేట్లు 8.25-14% వ‌ర‌కు ఉన్నాయి. ద్విచ‌క్ర వాహ‌న డీల‌ర్ల వ‌ద్ద రుణాలిచ్చే సంస్థ‌ల ప్ర‌తినిధులు కూడా ఉంటున్నారు. వాళ్ల‌ని ఈ రుణాల‌ కోసం సంప్ర‌దించ‌వ‌చ్చు. అయితే, రుణం తీసుకునేట‌ప్పుడు అన్ని బ్యాంకుల వ‌డ్డీ రేట్ల‌తో స‌రిపోల్చుకోవాలి. రుణాన్ని స‌మాన వాయిదా మొత్తాల‌తో (ఈఎంఐ) చెల్లించాలి.

3 సంవ‌త్స‌రాల కాల ప‌రిమితితో రూ.1 ల‌క్ష ద్విచ‌క్ర వాహ‌న రుణానికి వడ్డీ, ఈఎంఐలు ఇలా..

నోట్‌: ఈ డేటా 2022 సెప్టెంబ‌రు 13 నాటిది.  మీ క్రెడిట్ స్కోరు, వృత్తి, ఆర్జించే ఆదాయం ఆధారంగా వ‌డ్డీ రేటులో మార్పులు ఉండ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని