120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో iQOO 12.. ధర రూ.50వేల పైనే!

iQOO 12: చైనా కంపెనీ ఐకూ కొత్త మొబైల్‌ ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Updated : 14 Dec 2023 18:41 IST

iQOO 12 Lauched | ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ కంపెనీ ఐకూ (iQOO) మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. ఐకూ 12 (iQOO 12) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. మూడు సంవత్సరాల సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 120W ఫాస్ట్‌ఛార్జింగ్‌తో వస్తోంది. చైనాలో ఇది వరకే విడుదలైన ఈ ఫోన్‌పై చాలా అంచనాలు ఉన్నాయి. ఇంతకీ ఈ ఫోన్‌ ధరెంత, ఫీచర్లేంటో వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐకూ 12 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.52,999 కాగా.. 16జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.57,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌ ఆల్ఫా, వైట్‌ లెజెండ్‌ రంగుల్లో ఫోన్‌ లభిస్తుంది. అమెజాన్‌లో డిసెంబరు 14 మధ్యాహ్నం 12 గంట నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రమోషనల్‌ ఆఫర్‌ కింద  బ్యాంక్‌ డిస్కౌంట్‌తో కలుపుకొని ఈ ఫోన్‌ రూ.49,999కే లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులపై డిస్కౌంట్‌ వర్తిస్తుంది.

వ్యక్తిగత డేటా పోగొట్టుకున్న విషయం వాళ్లకే తెలియదట!

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఐకూ 12 (iQOO 12) ఆండ్రాయిడ్‌ 14 (Android 14) ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14 (Funtouch OS 14 skin on top)తో పనిచేస్తుంది. 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లే స్క్రీన్‌ ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్‌ రేట్‌తో వస్తోంది. ఆక్టాకోర్‌ క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ ఇచ్చారు. ట్రిపుల్‌ కెమెరాతో ఈ ఫోన్‌ వస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైల్డ్‌ యాంగిల్‌ కెమెరా, 64 ఎంపీ పెరిస్కోప్‌ టెలిఫొటో కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఇందులో 5,000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది 120w ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఐపీ64 రేటింగ్‌తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌, బ్లూటూత్‌ 5.4, ఇన్‌ఫ్రారెడ్‌ బ్లాస్టర్‌, యూఎస్‌బీ 2.0 టైప్‌-సి పోర్ట్‌తో ఈ ఫోన్‌ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని