Jio Phone 5G: జియో డబుల్‌ ధమాకా.. ఒకటి కాదు రెండు ఫోన్లు!

Jio 5g smartphones: జియో రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఆగస్టు 28న జరిగే ఏజీఎంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Published : 12 Aug 2023 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ జియో (Reliance Jio) అందుబాటులో ధరలో ఓ 5జీ స్మార్ట్‌ఫోన్‌ (5g smartphone) తీసుకొస్తోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి స్పెసిఫికేషన్స్‌ ఇవేనంటూ కొన్ని లీకులూ చక్కర్లు కొట్టాయి. అయితే, జియో.. ఒకటి కాదు రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు తీసుకొస్తోందంటూ మరో ప్రచారం తాజాగా మొదలైంది. ఆగస్టు 28న జరిగే రిలయన్స్‌ ఏజీఎంలో వీటిని లాంచ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జియో 5జీ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ముకుల్‌ శర్మ అనే టిప్‌స్టర్‌ కొన్ని వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. జియోకు చెందిన రెండు స్మార్ట్‌ఫోన్లు ఇటీవలే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (BIS) నుంచి సర్టిఫికేషన్‌ పొందాయని పేర్కొన్నాడు. ఆగస్టు 11న వీటికి ఆమోదం లభించిందని తెలిపాడు. JBV161W1, JBV162W1 పేర్లతో ఈ రెండు మోడళ్లు రిజిస్టర్‌ అయినట్లు తెలిపాడు. అంతకుమించి స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. 

మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ను వినియోగిస్తున్నారని, 4జీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజీ, 13 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటివి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఎప్పటి నుంచో లీకులు వస్తున్నప్పటికీ.. రిలయన్స్‌ జియో మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంతకీ ఏయే ఫీచర్లతో తెస్తారు? ఎంత ధరలో తెస్తారు? వంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ నెల 28న జరిగే ఏజీఎం వరకు వెయిట్‌ చేయాల్సిందే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని