JioMotive: కార్ల కోసం జియో బుల్లి డివైజ్‌.. ఒక్క పరికరంతో ఎన్ని ప్రయోజనాలో!

JioMotive: కారు ప్రయాణాల్ని మరింత సురక్షితంగా మార్చేందుకు జియో కొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. జీయో మోటీవ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ పరికరం కారులోని లోపాల్ని ముందుగానే గుర్తించి వెంటనే నోటిఫికేషన్‌ పంపుతుంది.

Updated : 10 Nov 2023 20:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కారు అద్దెకిచ్చిన సమయంలో దాని భద్రత గురించి యజమానులు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. వాహనంలో ఏవైనా అంతరాయం ఉందా? డ్రైవర్‌ స్పీడ్‌ లిమిట్‌ దాటుతున్నాడా? అంటూ ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. వాహనం కండీషన్‌ కోసం ఆందోళన చెందకుండా, దాని పరిస్థితి గురించి మాటిమాటికీ డ్రైవర్‌కు ఫోన్‌ చేయకుండా కారు కండిషన్‌ తెలిస్తే ఎంత బాగుంటుందో కదా..? ఈ సదుపాయాన్ని డ్రైవర్‌తో పాటు యజమానికి కల్పించటం కోసం జియో కొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. దీని పేరు జియో మోటివ్‌. JioMotive (2023). కారులో ఏవైనా లోపాలు గుర్తిస్తే అలర్ట్‌ చేస్తుంది. ఈ-సిమ్‌ కార్ట్‌తో ఇది పనిచేస్తుంది. వై-ఫై హాట్‌స్పాట్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి.

మెరుగైన సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌లోనే రూమ్‌.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

జియో మోటివ్‌ డివైజ్‌ను కారులోని ఓబీడీ పోర్ట్‌కి కనెక్ట్‌ చేస్తే చాలు.. కారుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్‌కు నోటిఫికేషన్‌ రూపంలో అందుతుంది. ఇక ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే.. జియో మోటివ్‌తో మీ కారు మరింత స్మార్ట్‌గా మారుతుంది. ఈ పరికరం కారు లొకేషన్‌ను ఎల్లప్పుడూ ట్రాక్‌ చేస్తుంటుంది. కారు హెల్త్‌ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుంది. బ్యాటరీ వోల్టేజ్, ఇంజిన్ టెంపరేచర్‌ని ట్రాక్ చేస్తుంది. డ్రైవింగ్‌ ఆధారంగా సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఓవర్‌ స్పీడ్‌, హార్ష్‌ బ్రేకింగ్‌ వంటి సందర్భాల్లో డ్రైవర్‌ని హెచ్చరిస్తుంది. యాంటీ థెప్ట్‌, జియో ఫెన్సింగ్, టైమ్‌ ఫెన్సింగ్‌ సదుపాయాలు ఉన్నాయి. డ్రైవర్‌, యజమాని ఇద్దరూ ఈ జియో మోటివ్‌ ద్వారా నోటిఫికేషన్‌ పొందొచ్చు. జియో థింగ్స్‌ యాప్‌ సాయంతో దీన్ని వినియోగించుకోవచ్చు. కారు భద్రతను పెంచే ఈ స్మార్ట్‌ పరికరం ధర రూ.4,999గా జియో నిర్ణయించింది. మొబైల్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి సులువుగా నోటిఫికేషన్‌ పొందొచ్చు. జియో మార్ట్‌ (JioMart), రిలయన్స్‌ డిజిటల్‌ (Reliance Digital) ద్వారా కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని