Jio Offer: జియో న్యూ ఇయర్‌ ఆఫర్‌.. ఈ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ..

Jio New Year Offer: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టనున్న తరుణంలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇప్పటికే ఉన్న ఓ ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై అదనపు వ్యాలిడిటీ ప్రకటించింది.

Published : 25 Dec 2023 15:12 IST

Jio Offer | ఇంటర్నెట్‌డెస్క్‌: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టనున్న తరుణంలో ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) ప్రత్యేక ఆఫర్లు ప్రవేశపెట్టింది. ఏడాది కాలపరిమితితో ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌పై ‘హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ 2024’ (Happy New Year Offer 2024) పేరిట అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. జియో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Jio Prepaid Plan) యూజర్లకు ఈ ఆఫర్‌ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ప్లాన్‌ వివరాలపై ఓ లుక్కేయండి.

పేటీఎంలో 1000 మంది ఉద్యోగులపై వేటు

ఇప్పటికే జియో అందిస్తున్న రూ.2,999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా అందిస్తోంది. అయితే జియో తీసుకొచ్చిన న్యూ ఇయర్‌ ఆఫర్‌లో భాగంగా రీఛార్జ్‌ చేసుకుంటే 24 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందొచ్చు. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్‌ని వినియోగించుకోవచ్చన్నమాట. దీంతో పాటూ జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఏడాది పాటూ ఉచితంగా వీక్షించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని