Jio prima 4g: యూట్యూబ్‌, వాట్సాప్‌ సదుపాయంతో జియో నుంచి మరో ఫోన్‌

Jio prima 4g details: రిలయన్స్‌ మరో జియో ఫోన్‌ తీసుకొచ్చింది. యూట్యూబ్, వాట్సాప్‌లను ఇందులో వినియోగించుకోవచ్చు. దీని ధరను రూ.2,599గా కంపెనీ నిర్ణయించింది.

Updated : 30 Oct 2023 15:33 IST

Jio prima 4g | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) వరసగా ఫీచర్‌ ఫోన్లను లాంచ్‌ చేస్తోంది. తక్కువ ధరలో ఆకర్షణీయ ఫీచర్లతో ఇటీవల భారత్ సిరీస్‌ ఫోన్లను జియో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జియో ఫోన్‌ ప్రైమా 4జీ (Jio prima 4g) పేరిట మరో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2023లో దీన్ని ప్రదర్శించింది. దీపావళికి ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. దీని ధర, ఇతర వివరాలు జియో మార్ట్‌ వెబ్‌సైట్‌లో కాసేపు ప్రత్యక్షమయ్యాయి.

జియో ఫోన్‌ ప్రైమా 4జీ (Jio prima 4g) ఫోన్‌ 2.4 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో పనిచేస్తుంది. ఫ్లాష్‌లైట్‌, కెమెరా సదుపాయం ఉంది. 512 ఎంబీ ర్యామ్‌ అమర్చారు. మెమొరీ కార్డు ద్వారా 128 జీబీ వరకు పొడిగించుకునే వీలుంది. KaiOSపై ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఆర్మ్‌ కోర్టెక్స్‌ ఏ53 ప్రాసెసర్‌తో వస్తోంది. బ్లూటూత్‌ 5.0, 1800 ఎంఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు. ఎఫ్‌ఎం రేడియో సదుపాయం ఇస్తున్నారు. 

‘బిగ్‌ దీపావళి సేల్‌’కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌.. ఎప్పటి నుంచంటే?

యూట్యూబ్‌, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్‌, జియో న్యూస్‌ వంటి యాప్స్‌ ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా వస్తున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి యాప్స్‌నూ వినియోగించుకోవచ్చు. జియో పే ద్వారా యూపీఐ పేమెంట్స్‌ చేయొచ్చు. మొత్తం 23 భాషలకు సపోర్ట్‌ చేస్తుంది. దీపావళి సమయానికి అందుబాటు వివరాలు తెలుస్తాయి. మరోవైపు జియో భారత్‌ పేరిట ఇటీవల కొన్ని ఫోన్లను జియో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటి ధరలు రూ.999 నుంచి ప్రారంభమవుతాయి. లేటెస్ట్‌గా యూపీఐ సదుపాయంతో జియో భారత్‌ బీ1 4జీ ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీని ధరను రూ.1299గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్‌, జియో ఔట్‌లెట్స్‌లో ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని