Lava Yuva 3 Pro: ₹9 వేలకే లావా కొత్త ఫోన్‌.. ఫీచర్లివే..

Lava Yuva 3 Pro: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా లావా యువ 3 ప్రో పేరుతో బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్‌ చేసింది.

Published : 14 Dec 2023 21:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా (Lava) కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. లావా యువ 3 ప్రో (Lava Yuva 3 Pro) పేరిట దీన్ని ఆవిష్కరించింది. ఇది సింగిల్‌ వేరియంట్‌లో వస్తోంది. 8జీబీ+ 128జీబీ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,999గా కంపెనీ నిర్ణయించింది. డెసర్ట్‌ గోల్డ్‌, ఫారెస్ట్ విరిడియన్‌, మెడో పర్పల్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభిస్తుంది. లావా ఇ-స్టోర్‌, రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది.

LIC, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డ్‌.. ప్రీమియం చెల్లింపులపై రివార్డ్స్‌

ఆండ్రాయిడ్‌ 13తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ యూనిసోక్‌ T616 ప్రాసెసర్‌ అమర్చారు. వెనుకవైపు 50 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా ఇచ్చారు. వీడియో కాల్స్, సెల్ఫీ కోసం ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా ఉంది. 128 జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్ సాయంతో 512జీబీ వరకు స్టోరేజీని పెంచుకొనే సదుపాయం ఉంది. 5000mAh బ్యాటరీ ఉన్న ఈ ఫోన్‌ 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్‌, బ్లూటూత్‌ 5, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ సదుపాయంతో ఈ ఫోన్‌ తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని