LIC, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డ్‌.. ప్రీమియం చెల్లింపులపై రివార్డ్స్‌

LIC Credit card: ఎల్‌ఐసీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో ఓ కో బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపులపై రివార్డు పాయింట్లు పొందొచ్చు.

Published : 14 Dec 2023 19:33 IST

LIC Credit card | దిల్లీ: ఎల్‌ఐసీ (LIC) అనుబంధ ఎల్‌ఐసీ కార్డ్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, మాస్టర్‌ కార్డ్‌ కలిసి ఓ కో-బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. ఎల్‌ఐసీ ఇన్సురెన్స్‌ ప్రీమియం చెల్లింపులపై ఈ కార్డు ద్వారా రివార్డులు పొందొచ్చు. ఇతర అవసరాలకూ ఈ కార్డులను వినియోగించుకోవచ్చు. ఎల్‌ఐసీ క్లాసిక్‌, ఎల్‌ఐసీ సెలక్ట్‌ వేరియంట్లలో ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. రూ.5 లక్షల వరకు వ్యక్తిగత యాక్సిడెంటల్‌ కవరేజీతోపాటు, రూ.50వేల వరకు కార్డు లయబిలిటీ కవరేజీ లభిస్తుంది. ఎయిర్‌ పోర్ట్‌, రైల్వేస్టేషన్లలో లాంజ్‌ యాక్సెస్‌ వంటివి లభిస్తాయి. 

ఫీచర్ల విషయానికొస్తే... ఎల్‌ఐసీ క్లాసిక్‌ అనేది పూర్తి లైఫ్‌టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌కార్డు. కార్డు తీసుకున్న మొదటి నెలలోనే రూ.5000 ఖర్చు చేస్తే వెయ్యి రివార్డు పాయింట్లు లభిస్తాయి. విమాన టికెట్లు, సౌందర్య ఉత్పత్తుల కొనుగోలుకు రూ.500 చొప్పున కూపన్లు, లెన్స్‌కార్ట్, ఫార్మా ఈజీ మెంబర్‌షిప్‌ లభిస్తుంది. ఎల్‌ఐసీ ఇన్సురెన్స్‌ ప్రీమియం చెల్లింపులపై 6X రివార్డు పాయింట్లు లభిస్తాయి. ఇతర కొనుగోళ్లపై 3X రివార్డు పాయింట్లు వస్తాయి. వీటిని ఆన్‌లైన్‌ కొనుగోళ్లతో పాటు తదుపరి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లింపుల సమయంలో వినియోగించుకోవచ్చు.

Nokia: నోకియా ఫీచర్‌ ఫోన్లలోనూ ఇకపై యూట్యూబ్‌ షార్ట్స్‌

ప్రతి రూ.125 కొనుగోళ్లపై 1X రివార్డు పాయింట్లు లభిస్తుంది. 1 రివార్డు పాయింట్‌ = 0.25. ఏటీఎం విత్‌డ్రాలపై రూ.199+ జీఎస్టీ వర్తిస్తుంది. ఆపై చెల్లింపు తేదీ వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. ప్రతి త్రైమాసికానికోసారి దేశీయ విమానాశ్రయాల్లో ఒకసారి లాంజ్‌ సౌకర్యం, రూ.2లక్షల వరకు పర్సనల్‌ యాక్సిడెంటల్‌ కవరేజీ లభిస్తుంది. ఎల్‌ఐసీ సెలక్ట్‌ కూడా లైఫ్‌ టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డు. క్లాసిక్‌ కార్డు ఫీచర్‌ కంటే దీంట్లో కొన్ని అధిక ఫీచర్లు ఉన్నాయి. ఒక్కో త్రైమాసికంలో రెండుసార్లు ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ సౌకర్యాన్ని ఈ కార్డు హోల్డర్లు వినియోగించుకోవచ్చు. నాలుగుసార్లు రైల్వే లాంజ్‌ సౌకర్యాన్ని పొందొచ్చు. ఈ కార్డు తీసుకున్న వారికి రూ.5 లక్షల వరకు పర్సనల్‌ యాక్సిడెంటల్ కవరేజీ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని