LIC HFL: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ FDపై 7.75% వడ్డీ.. పూర్తి వివరాలు ఇవే!

LIC HFL Public Deposits: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ పబ్లిక్‌ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం వడ్డీ లభిస్తుంది.

Published : 19 Oct 2023 10:00 IST

LIC HFL Public Deposits | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ రెపోరేట్లు పెంచినప్పటి నుంచి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా మారాయి. దీంతో ప్రస్తుతం ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులు గరిష్ఠంగా 7 శాతం వరకు వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. సీనియర్‌ సిటిజన్లకు మరో 0.25 శాతం అధికంగా ఇస్తున్నాయి. కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులైతే 9 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. సాధారణ కమర్షియల్‌ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ, పైగా రిస్క్‌ ఫ్రీ పథకాల కోసం చూస్తున్నారా? అయితే ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ‘సంచయ్‌’ పేరుతో అందిస్తున్న డిపాజిట్‌ స్కీమ్‌ను పరిశీలించొచ్చు. వివిధ కాలవ్యవధిలోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కనిష్ఠంగా 7.25%, గరిష్ఠంగా 7.75% వడ్డీని అందిస్తోంది. సీనియర్‌ సిటిజన్లు గరిష్ఠంగా 8 శాతం వడ్డీని అందుకోవచ్చు.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రెండు రకాల పబ్లిక్‌ డిపాజిట్లను సేకరిస్తోంది. క్యుములేటివ్‌, నాన్‌ క్యుములేటివ్‌ పేరిట ఇవి లభిస్తాయి. ఏడాది, 18 నెలలు, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్ల కాల వ్యవధులకు సొమ్ము డిపాజిట్‌ చేయొచ్చు. కనీసం రూ.20వేలు, ఆపై రూ.వెయ్యి చొప్పున రూ.20 కోట్ల వరకు డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

క్యుములేటివ్‌ వడ్డీ రేట్లు ఇలా..

క్యుములేటివ్‌ పబ్లిక్‌ డిపాజిట్ల కింద ఏడాదికి 7.25%, 18 నెలలకు 7.35%, 2 ఏళ్లకు 7.60%, 3 ఏళ్లకు 7.75 %, 5 ఏళ్లకు 7.75% చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ పద్ధతిలో ఏడాది మొత్తానికి వడ్డీ లెక్కించి మెచ్యూరిటీ తర్వాత ప్రిన్సిపల్‌ అమౌంట్‌తో పాటు చెల్లిస్తారు. ఒకవేళ ఆదాయపు పన్ను వర్తిస్తే దానిని మినహాయించి చెల్లింపులు చేస్తారు.

నాన్‌ క్యుములేటివ్‌ వడ్డీ రేట్లు

నాన్‌ క్యుములేటివ్‌ డిపాజిట్ల కింద నెలవారీ లేదా ఏడాదికోసారి వడ్డీ మొత్తాన్ని పొందే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఆప్షన్‌ను బట్టి వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది. ఏడాది, 18 నెలలు, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్ల కాలవ్యవధికి డిపాజిట్‌ చేయొచ్చు.

  • నెలవారీ వడ్డీ ఆప్షన్‌ ఎంచుకుంటే ఏడాది కాలవ్యవధి డిపాజిట్‌పై 7% వడ్డీ లభిస్తుంది. అదే ఏడాది ఆప్షన్‌ ఎంచుకుంటే 7.25 %వడ్డీ లభిస్తుంది.
  • 18 నెలల డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్‌ ఎంచుకుంటే 7.10%, ఏడాది ఆప్షన్‌ ఎంచుకుంటే 7.35% వడ్డీ లభిస్తుంది.
  • 2 ఏళ్ల డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్‌ ఎంచుకుంటే 7.35%, ఏడాది ఆప్షన్‌ ఎంచుకుంటే 7.60% వడ్డీ లభిస్తుంది.
  • 3 ఏళ్ల డిపాజిట్‌పై నెలవారీ ఆప్షన్‌ ఎంచుకుంటే 7.50%, వార్షిక ఆప్షన్‌ ఎంచుకుంటే 7.75% వడ్డీ లభిస్తుంది.
  • 5 ఏళ్ల కాలానికి నెలవారీ ఆప్షన్‌ ఎంచుకుంటే 7.50%, ఏడాది ఆప్షన్‌ ఎంచుకుంటే 7.75% వడ్డీ లభిస్తుంది.

ఫీచర్లు ఇవే..

  • ఎల్‌ఐసీ డిపాజిట్లకు క్రిసిల్‌ నుంచి AAA/ స్థిరత్వం రేటింగ్‌ ఉంది.
  • భారత పౌరులు, ఎన్నారైలు, గార్డియన్‌ ద్వారా మైనర్లు, హెచ్‌యూఎఫ్‌లు, కోపరేటివ్‌ సొసైటీలు ఈ డిపాజిట్‌ పథకాల్లో జమ చేయొచ్చు.
  • ఆటో రెన్యువల్‌, ఆటో రీపేమెంట్‌ సదుపాయం ఉంది.
  • వడ్డీ, ప్రిన్సిపల్‌ మొత్తాల చెల్లింపులకు ఎలక్ట్రానిక్‌ పేమెంట్‌ సదుపాయం ఉంది.
  • సీనియర్‌ సిటిజన్లకు అన్ని కాలవ్యవధి కలిగిన డిపాజిట్లపై (రూ.2 కోట్ల వరకు) 0.25 శాతం వడ్డీ లభిస్తుంది.
  • డిపాజిట్‌పై 75 శాతం వరకు రుణ సదుపాయం ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని