Zomato: ఒక రోజు ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా టెక్ ఉద్యోగి.. ఎందుకిలా చేశాడంటే

drone deliver orders Zomato: డెలివరీ ఏజెంట్ల కష్టం చూసి వారి పని సులభతరం చేయటం కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. తన ప్రయోగాన్ని పరీక్షించటంలో భాగంగా ఒక రోజు డెలివరీ బాయ్‌గా మారాడు.

Updated : 03 Aug 2023 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డెలివరీ ఏజెంట్ల పని సులభతరం చేయటానికి డ్రోన్‌ సాయంతో ఫుడ్ డెలివరీలను ప్రారంభించాలని చాలా కాలం నుంచి మార్కెట్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీన్ని ఇప్పటివరకు ఏ సంస్థ ప్రారంభించలేదు. దీంతో డ్రోన్‌ డెలివరీని నిజం చేయాలనుకున్నాడు ఓ టెక్‌ ఉద్యోగి. దీనికోసం సొంతంగా డ్రోన్‌ తయారు చేశాడు. దాన్ని టెస్టింగ్‌ చేయటంలో భాగంగా ఒక రోజు జొమాటో డెలివరీ బాయ్‌గా మారాడు. 

ట్రాఫిక్ సమస్యలున్నా, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కస్టమర్ల ఇంటిని గుర్తించి సమయానికి పార్సల్ అందిస్తుంటారు డెలివరీ ఏజెంట్లు. డెలివరీలు అందించటం కోసం ఏజెంట్లు పడే కష్టం చూసి ఓ ఆలోచన తట్టింది. వీరు చేస్తున్న పనికి డ్రోన్ తోడైతే బాగుంటుందనిపించింది. దీని కోసం ఒక రోజంతా కష్ట పడి తానే స్వయంగా డ్రోన్‌ను తయారు చేశాడు. అందులోనే కస్టమర్ల వద్దే పార్సల్‌ను వదిలేసే విధంగా ఉండేట్టుగా డ్రాపింగ్‌ మెకానిజమ్‌ను అందులో అమర్చాడు. ఇది డెలివరీ ఏజెంట్లకు ఏ విధంగా ఉపయోగపడుతుందో పరీక్షిద్దాం అనుకున్నాడు. అందులో భాగంగానే ఒక రోజు డెలివరీ ఏజెంట్‌గా మారాడు. డ్రోన్ సాయంతో ఒక రోజంతా డెలివరీలు అందించాడు. తన ప్రయోగం విజయవంతం కావటంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

శాంసంగ్‌ కోటి రుపాయల టీవీ.. ఫీచర్లివే..

‘డ్రోన్‌ల ద్వారా చాలా ప్రాంతాల్లో డెలివరీలు జరుగుతున్నాయని వింటుంటాం. కానీ, ఎప్పుడూ వాటిని చూడలేదు. నాకు డ్రోన్‌పై ఉన్న విపరీతమైన ఇష్టంతో నా నైపుణ్యాలను ఉపయోగించి నేరుగా ఇంటికి డెలివరీ చేసే విధంగా డ్రోన్‌ను తయారుచేశాను. భద్రతా ప్రమాణాల మధ్యనే ఈ ప్రయోగాన్ని చేశాను. కస్టమర్ల మొఖంతో వెలుగు చూసి చాలా ఆనందం వేసింది. డ్రోన్‌ ద్వారా డెలివరీ చేయటం కల కాదు. రానున్న రోజుల్లో ఇండియాలో ఇది ప్రారంభమవుతుంది’ అంటూ వ్యాఖ్యలు జోడించి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు. అంతే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ ఆప్షన్‌ఎంచుకుంటే ఏం చేస్తావ్ భయ్యా’ అని ఓ వ్యక్తి కామెంట్ పెడితే, ‘డ్రోన్‌తోనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే మీ డ్రోన్‌ వెనక్కి రాకపోతే ఏం చేస్తావ్’ అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు. మార్కెట్‌లోకి తీసుకురావాలంటే ఇందులో మరికొంత సాంకేతికలు జోడించాల్సి ఉంటుందని టెకీ సమాధానమిచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని