Maruti suzuki brezza: మారుతీ సుజుకీ బ్రెజా 10 లక్షల సేల్స్ మార్క్‌

Maruti suzuki brezza sales: మారుతీ సుజుకీ బ్రెజా సేల్స్‌లో కొత్త మైలురాయిని అందుకుంది. 10 లక్షల విక్రయాలు నమోదు చేసింది.

Published : 27 Dec 2023 17:58 IST

Maruti suzuki | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti suzuki) తీసుకొచ్చిన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ బ్రెజా (brezza) సరికొత్త మైలురాయిని అందుకుంది. 2016 మార్చిలో విడుదలైన ఈ కారు ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లు అమ్ముడైంది. లాంచ్‌ అయిన 94 నెలల్లో ఈ మైలురాయిని అందుకుంది. అంతేకాదు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బెస్ట్‌ సెల్లింగ్‌ కారు గానూ నిలిచింది.

2016 మార్చి నుంచి 2023 నవంబర్‌ వరకు 9.96 లక్షల యూనిట్లను మారుతీ సుజుకీ విక్రయించింది. నవంబర్‌ నాటికి 3,392 యూనిట్ల దూరంలో నిలిచింది. డిసెంబర్‌ తొలి వారంలో ఆ మైలురాయిని బ్రెజా చేరుకున్నట్లు ఆటో కార్‌ ఇండియా తెలిపింది. విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు నెలకు సగటున 13,921 యూనిట్లను మారుతీ విక్రయించింది.

ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్‌ సేల్స్‌ విషయంలో అగ్రగామిగా ఉండేది. ఈ ఏడాది మార్చిలో బ్రెజాలో సీఎన్‌జీ వెర్షన్‌ను మారుతీ తీసుకొచ్చింది. దీంతో టాటా నెక్సాన్‌ను బ్రెజా అధిగమించేందుకు దోహదపడింది. ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్‌, హోండా ఎలివేట్‌, ఫోక్స్‌వ్యాగన్‌ టైగన్‌, స్కోడా కుషక్‌, హ్యుందాయ్‌ క్రెటా బ్రెజాకు గట్టి పోటీ ఇస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని