Grand Vitara CNG: మారుతీ గ్రాండ్‌ విటారాలో సీఎన్‌జీ వెర్షన్‌ @రూ.12.85 లక్షలు

Grand Vitara CNG: హరిత ఇంధన వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా మారుతీ సుజుకీ తాజాగా గ్రాండ్‌ విటారాలో సీఎన్‌జీ వెర్షన్‌ను తీసుకొచ్చింది.

Published : 06 Jan 2023 14:21 IST

దిల్లీ: మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ గ్రాండ్‌ విటారా (Grand Vitara)లో ఎస్‌-సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది డెల్టా, జీటా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ. 12.85 లక్షలు, రూ. 18.84 లక్షలు (ఎక్స్‌- షోరూం). 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. మైలేజీ కేజీకి 26.6 కి.మీగా కంపెనీ పేర్కొంది.

ఇదే విటారా (Grand Vitara)లో పెట్రోల్‌తో నడిచే డెల్టా, జీటా వేరియంట్ల ధర రూ. 10.45 లక్షలు- రూ. 19.49 లక్షల మధ్య ఉంది. సీఎన్‌జీ వెర్షన్‌తో విటారా (Grand Vitara)కు ఆదరణ పెరుగుతుందని మారుతీ (Maruti Suzuki) ఆశాభావం వ్యక్తం చేసింది. హరిత ఇంధన వాహనాలకు ప్రాధాన్యం పెంచడంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. తాజా విటారాతో కలిపి మారుతీ మొత్తం 14 మోడళ్లలో సీఎన్‌జీ వెర్షన్‌ను అందిస్తోంది.

విటారా ఎస్‌-సీఎన్‌జీ వెర్షన్‌లో 1.5 లీటర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 6,000 ఆర్‌పీఎం వద్ద 99 బీహెచ్‌పీ శక్తిని, 4,400 ఆర్‌పీఎం దగ్గర 136 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం, యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, కొత్త తరం సుజుకీ కనెక్ట్‌ సహా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని