Mercedes-Benz: చిన్న నగరాలపై మెర్సిడెస్‌ బెంజ్‌ ఫోకస్‌

మెర్సిడెస్‌-బెంజ్‌ భారత్‌లోని చిన్న నగరాల్లో (నాన్‌-మెట్రోల్లో) కూడా తన కార్ల అమ్మకాల, సేవల మార్కెట్‌ను విస్తరించాలని చూస్తోంది.

Published : 31 Jan 2024 19:37 IST

దిల్లీ: జర్మన్‌ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌-బెంజ్‌.. భారత్‌లోని చిన్న నగరాల్లో తన ఉనికిని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. చిన్న నగరాల్లో కూడా భవిష్యత్‌లో లగ్జరీ మోడళ్లకు డిమాండ్‌ పెరుగుతుందని సంస్థ భావిస్తోంది. ఇవాళ కొత్త GLA, AMG GLE 53 మోడళ్లను విడుదల చేసింది. GLA SUVని ధరను రూ.50.50-56.90 లక్షలుగా నిర్ణయించింది. AMG GLE 53 4MATIC ధర రూ.1.85 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. 

పెరుగుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి నాన్‌-మెట్రో నగరాల్లో తన విక్రయాలు, సేవా మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని యోచిస్తోంది. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి.. జమ్మూ, కాన్పూర్‌, పట్నా వంటి 10 కొత్త నగరాల్లో కంపెనీ 20 కొత్త వర్క్‌ షాప్‌లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. మెట్రో నగరాల్లో ప్రస్తుత మెర్సిడెస్‌ వార్షిక విక్రయాలు 70% వాటాను కలిగి ఉన్నాయి. భారత్‌లోని లగ్జరీ కార్ల మార్కెట్‌ సంవత్సరానికి దాదాపు 40 లక్షల యూనిట్ల వరకు ఉంది. ఇది మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో 1% మాత్రమే. ప్రస్తుతం మార్కెట్‌ విక్రయాల్లో మెర్సిడెస్‌-బెంజ్‌ అగ్రగామిగా ఉంది. భారత్‌లోని 8 పెద్ద నగరాల్లో మెర్సిడెస్‌-బెంజ్‌ విక్రయాలు 2.50 శాతంగా ఉంటే; చిన్న నగరాలు, పట్టణాల్లో 0.40 శాతంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని