Suzuki Hayabusa: 3 కొత్త రంగుల్లో సుజుకీ కొత్త హయబుసా.. ధర ₹16.90 లక్షలు!

Suzuki Hayabusa: సుజుకీ కంపెనీ కొత్త హయబుసా బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.16.90 లక్షలుగా నిర్ణయించింది.

Published : 08 Apr 2023 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ సుజుకీ (Suzuki) కొత్త హయబుసా (Suzuki Hayabusa 2023) మోటార్‌ సైకిల్‌ను భారత మార్కె్ట్లోకి విడుదల చేసింది. కొత్తగా ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ.. నూతన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఓబీడీ-2తో పాటు మూడు కొత్త రంగుల్లో బైక్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. దీని ధరను రూ. 16.90 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గత మోడల్‌తో పోలిస్తే రూ.49వేలు అదనం. బుకింగ్స్‌ కూడా మొదలైనట్లు కంపెనీ పేర్కొంది. 

కొత్త సుజుకీ హయబుసాలో డ్యూయల్‌ టోన్‌ కలర్‌ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. వైట్‌, మెటాలిక్‌ గ్రే, నలుపు రంగుల్లో ఈ బైక్‌ లభిస్తుంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే... ఈ బైక్‌లో 1340సీసీ ఫోర్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ అమర్చారు. కొత్త హయబుసాలో ఎప్పటికప్పుడు ఉద్గార ప్రమాణాలను తెలుసుకోవచ్చు. ఇందులోని ఇంజిన్‌ 187 బీహెచ్‌పీని, 150Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌, మూడు పవర్‌ మోడ్స్‌, క్రూయిజ్‌ కంట్రోల్ ఉంటుంది. సుజుకీ హయబుసాపై భారత్‌లో చూపిస్తున్న ఆదరణను చూసి కొత్త రంగులతో పాటు ఆన్‌బోర్డు సెల్ఫ్‌ డయాగ్నస్టిక్‌ డివైజ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా ఎండీ కెనెచి ఉమెదా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని