Income Tax: ఈ లెక్కలు వేశాకే పన్ను విధానం ఎంపిక చేసుకోండి..
పన్ను చెల్లింపుదారులకు పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది అనుకూలంగా ఉంటుందో ఉదాహరణలతో తెలుసుకుందాం
ఇంటర్నెట్ డెస్క్: నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి ఏటా ఆదాయపు పన్ను (Income tax) చెల్లించాలి. వార్షిక ఆదాయానికి తగినట్లు వర్తించే పన్ను శ్లాబు (Tax slab) ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాత, కొత్త అనే రెండు విధానాల్లో (Old, New tax Regime) ఆదాయపు పన్ను చెల్లించే అవకాశం ఉంది. అయితే, ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో (Budget 2023) కొత్త పన్ను విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) సవరించారు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ విధానం బెటర్?
కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది బెటర్? అంటే.. సమాధానం చెప్పడం కష్టం. ఇది ఆ వ్యక్తి ఆదాయం, చేసే పన్ను ఆదా పెట్టుబడులు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొత్త పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపులు ఉండవు. కానీ, శ్లాబ్ రేటు తక్కువగా ఉంటుంది. అలాగే, పన్ను చెల్లింపుదారులు ఎవరి సాయం లేకుండా సులభంగా పన్ను రిటర్నులు దాఖలు చేయవచ్చు.
పాత పన్ను విధానంలో వివిధ పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఉంటాయి. ఇవి ఆదాయపు పన్ను వివిధ చట్టాలతో ముడిపడి ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు ఈ చట్టాలను అవగాహన చేసుకుని స్వయంగా రిటర్నులను దాఖలు చేయడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఇటువంటి వారు నిపుణుల సాయం తీసుకోవాల్సి రావచ్చు. కానీ, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం ద్వారా.. ఎటువంటి మినహాయింపులూ చూపించాల్సిన అవసరం లేదు. కాబట్టి, దాఖలు ప్రక్రియ సరళంగా, సులభంగా ఉంటుంది. బీమా, ఇతర పెట్టుబడులు లేని వారు కొత్త పన్ను విధానం ద్వారా ప్రయోజనం పొందొచ్చు.
పాత పన్ను విధానం..
పన్ను చెల్లింపుదారులు తాము చేసిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని పాత పన్ను విధానం ప్రకారం ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందో లెక్కించాలి. ఉదాహరణకు, ఉద్యోగులను తీసుకుంటే.. ఎల్‌టీఏ, హెచ్‌ఆర్‌ఏ, ప్రామాణిక తగ్గింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సి కిందికి వచ్చే పన్ను ఆదా పెట్టుబడులు చేసేవారు రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. అలాగే, గృహ రుణం తీసుకునే వారు వడ్డీ చెల్లింపులపై, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై, ఎన్‌పీఎస్, విద్యా రుణం వడ్డీ చెల్లింపులు మొదలైన వాటిపై మినహాయింపు క్లెయిమ్ చేసుకునే వీలుంది. ఇలా అన్ని మార్గాల్లో మినహాయింపులు లెక్కించిన తర్వాత.. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
కొత్త పన్ను విధానం..
ఇందులో ఎటువంటి మినహాయింపులు, తగ్గింపులు అనుమతించరు. అయితే, పాత పన్ను విధానంతో పోలిస్తే ప్రాథమిక మినహాయింపు పరిమితి (పాత విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.2.50 లక్షలు, కొత్త విధానంలో రూ.3 లక్షలు) ఎక్కువ. అలాగే, రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ లభిస్తుంది. ఎక్కువ శ్లాబులూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి, పన్ను చెల్లింపుదారులు వారికి వర్తించే శ్లాబు రేటు ప్రకారం చెల్లించాల్సిన పన్నును లెక్కించి ఏ విధానంలో ఎక్కువ లాభం పొందుతున్నారో తెలుసుకోవాలి. తదనుగుణంగానే ఎవరికి వారు వారికి సరిపోయే పన్ను వ్యవస్థను ఎంపిక చేసుకోవాలి.
ఉదాహరణ: రాజేష్, రమేష్ ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వీరి వార్షిక ఆదాయం, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని ఎవరికి ఏ విధానం అనుకూలంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
రాజేష్ వార్షిక ఆదాయం రూ.7 లక్షలు. అతడి వార్షిక పెట్టుబడులు ఇవీ..
పాత, కొత్త పన్ను విధానాల్లో రాజేష్‌కు ఎంత పన్ను వర్తిస్తుందంటే..?
రూ.7 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్ (Section 87A) ద్వారా పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చు. కాబట్టి, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడం మేలు.
ఇక రమేష్ వార్షిక ఆదాయం రూ. 12 లక్షలు. అతడి వార్షిక పెట్టుబడులు ఇవీ..
పాత, కొత్త పన్ను విధానాల్లో రమేష్‌కు ఎంత పన్ను వర్తిస్తుందంటే..?
రమేష్ పెట్టుబడులను బట్టి చూసుకుంటే.. అతడు కొత్త విధానాన్ని ఎంచుకోవడం ద్వారా రూ. 90,000, పాత విధానాన్ని ఎంచుకుంటే రూ.82,500 చెల్లించాల్సి వస్తుంది. అంటే పన్నులో రూ.7,500 వ్యత్యాసం ఉంది. అంటే, రమేష్‌కి పాత విధానమే సరిపోతుంది. అయితే అందరికీ ఇదే మాదిరి పెట్టుబడులు ఉంటాయని చెప్పలేం. కాబట్టి ముందుగా వివిధ సెక్షన్ల కిందకి వచ్చే పన్ను ఆదా పెట్టుబడులను గుర్తించి.. పాత, కొత్త పన్ను విధానాల్లో చెల్లించాల్సి పన్ను లెక్కించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Kim Jong Un: అణుదాడికి సిద్ధంగా ఉండండి..: కిమ్ జోంగ్ ఉన్
-
Sports News
Harbhajan Singh - Dhoni: ధోనీ నా ఆస్తులేం తీసుకోలేదు..: హర్భజన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
ప్రకటనల స్థానంలో పోర్న్ క్లిప్.. మండిపడిన ప్రయాణికులు.. రైల్వే స్టేషన్లో ఘటన
-
Movies News
Aishwaryaa: రజనీకాంత్ కుమార్తె నివాసంలో భారీ చోరీ
-
Politics News
TDP: దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను బయటపెట్టాలి: తెదేపా ఎమ్మెల్యేలు