Real Estate: దేశంలో ప్రధాన నగరాల్లో స్థిరాస్తిపై రాబడులు ఇవే..

దశాబ్ద కాలంగా దేశంలో వివిధ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ రిటర్న్స్‌ ఎంతెంత ఉన్నాయో ఇక్కడ చూడండి.

Published : 09 Feb 2024 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తులు తమ సంపదను పెంచుకోవడానికి అనేక రంగాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అలాంటి వాటిలో స్థిరాస్తి ఒకటి. ఇతర పెట్టుబడి ఐచ్ఛికాలతో పోలిస్తే స్థిరాస్తిలో రాబడి కొన్నిసార్లు తక్కువగా ఉండవచ్చు. కానీ, ఇన్వెస్టర్స్‌ రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిని శాశ్వత, స్టాండర్డ్‌ పెట్టుబడి సాధనంగా చూస్తారు. స్థిరాస్తిలో రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి.. మంచి రెసిడెన్షియల్‌ ఏరియాలో ఆస్తి ఉంటే అద్దె ఆదాయం ఉంటుంది. అలాగే, కాలక్రమేణా కొన్నిసార్లు ఆస్తి విలువ ద్రవ్యోల్బణానికి మించి కూడా పెరుగుతుంది. ఈ రోజు ఉన్న ఆస్తి విలువ, కొన్ని నెలల తర్వాత అలాగే ఉండదు. పెరుగుతూనే ఉంటుంది. స్థలాల విలువ, నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్స్‌ ధరలు కాలానుగుణంగా పెరగడం కూడా దీనికి ముఖ్య కారణం.

హైదరాబాద్‌ కూడా దేశంలో అత్యంత ఆశాజనకమైన స్థిరాస్తి గమ్యస్థానాల్లో ఒకటిగా అవతరించింది. విశాలమైన మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో అనుసంధానించడం వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ రూపురేఖలే మారిపోయాయి. దీంతో హైదరాబాద్‌ హౌసింగ్‌ ధరలు ఐదేళ్లలో 10-11% పెరిగాయి. దీనికి ముఖ్య కారణం నగరంలో అనేక ఐటీ పరిశ్రమలు, ఔషధ, బయోటెక్నాలజీ పరిశ్రమలకు ప్రాముఖ్యత ఇవ్వడం. పారిశ్రామిక పార్కులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిచ్చాయి. గృహ, వాణిజ్య స్థలాలకు పెరిగిన డిమాండ్‌ కూడా స్థిరాస్తి రంగాన్ని సానుకూలంగా ప్రభావితం చేసింది. ఫలితంగా, హైదరాబాద్‌లోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు దీర్ఘకాలిక రాబడి కోసం చూస్తున్న వారికి లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, మియాపూర్‌, తెల్లాపూర్‌, కోకాపేట్‌, నార్సింగి ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ హాట్‌స్పాట్స్‌గా అభివృద్ధి చెందాయి.

స్థిరాస్తి రంగం దేశంలోనే అత్యంత ప్రభావిత రంగాల్లో ఒకటి. ఇది పెద్ద శ్రామికశక్తిని కలిగి ఉండడమే కాకుండా.. జీడీపీలో దీని వాటా 7 శాతంగా ఉంది. ముంబయి, దిల్లీ-ఎన్‌సీఆర్‌ వంటి మెట్రో నగరాలు అనేక వ్యాపారాలకు కేంద్రాలుగా ఉన్నందున పెట్టుబడి పరంగా కూడా మరింత ఆకర్షణీయంగా మారాయి. 

దేశంలో వివిధ ప్రధాన నగరాల్లో స్థిరాస్తిపై రాబడులు ఎంతెంత ఉన్నాయో ఈ కింది పట్టికలో చూద్దాం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని