Jio Prepaid Plan: ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌తో జియో వార్షిక ప్లాన్‌

Jio Prepaid Plans: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ యూజర్ల కోసం కొత్త వార్షిక ప్లాన్‌ ప్రవేశపెట్టింది. ఇందులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా జతచేసింది.

Updated : 24 Oct 2023 19:38 IST

Jio prepaid plan | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Reliance Jio) తన యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ (Jio Prepaid Plan) ప్రవేశపెట్టింది. ఏడాది కాలపరిమితితో వస్తున్న ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌తో పాటూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

రూ.3,227తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే ఏడాదికి మొత్తం 730 జీబీ వినియోగించుకోవచ్చు. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఏడాది కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌కు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) మొబైల్‌ ఎడిషన్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. దీంతో పాటు జియో క్లౌడ్‌, జియో టీవీ, జియో సినిమా యాక్సెస్‌ కూడా ఉంటుంది.

ఆరు నెలల్లోనే వేదాంతకు తిరిగొచ్చిన అజయ్‌ గోయల్‌

ఒకవేళ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ వద్దనుకుంటే.. సోనీలివ్‌ (SonyLiv), జీ5 (ZEE5) సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్లు కూడా ఎంచుకోవచ్చు. రూ.3,662 తో రీఛార్జ్‌ చేయించుకుంటే సోనీలివ్‌, జీ5 రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. అదే రూ.3,226 ప్లాన్‌తో అయితే సోనీలివ్‌, రూ.3,225 ప్లాన్‌తో జీ5, 3,178 ప్లాన్‌తో డిస్నీ+హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ప్లాన్లలోనూ అపరిమిత వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఏడాది గడువుతో మరో ప్లాన్‌ను కూడా జియో అందిస్తోంది. దీని ధర రూ.2,545 (1.5జీబీ డేటా/డే). దీంట్లో ఎలాంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లూ ఉండవు. అయితే, జియో క్లౌడ్‌, జియో టీవీ, జియో సినిమా యాక్సెస్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని