Galaxy S24 Series: గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ వచ్చేసింది.. ధర, ఫీచర్లివే!

Samsung Galaxy S24 Series: శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ ఫోన్లు విడుదలయ్యాయి. వీటి ఫీచర్లు, ధరల వివరాలు చూద్దాం..!

Updated : 18 Jan 2024 18:54 IST

Samsung Galaxy S24 Series | ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌.. గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ ఫోన్లను బుధవారం విడుదల చేసింది. ఎస్‌24, ఎస్‌24+, ఎస్‌24 అల్ట్రా పేరిట తీసుకొచ్చిన ఈ మూడు వేరియంట్ల ధరలను గురువారం ప్రకటించింది. 6.8 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2X తెరలు, 200 మెగాపిక్సెల్‌ వరకు ప్రధాన కెమెరా వంటి ఫీచర్లు వీటిలో ప్రధాన ఆకర్షణ. ఏడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. చాలా ఫీచర్లను కృత్రిమ మేథతో అనుసంధానించినట్లు వెల్లడించింది.

గెలాక్సీ ఎస్‌24 ఫీచర్లు..

  • 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X LTPO తెర
  • అమెరికా, దక్షిణ కొరియా, చైనాలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌; భారత్‌ సహా ఇతర దేశాల్లో ఎగ్జినోస్‌ 2400 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (7 ఏళ్ల వరకు ఓఎస్‌ అప్‌డేట్లు)
  • వెనుక భాగంలో 50MP ఓఐఎస్‌+ 12MP అల్ట్రావైడ్‌+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్‌ జూమ్‌ లెన్స్‌ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా
  • 25వాట్ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌, 4.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీ
  • యూఎస్‌బీ టైప్‌-సి, జీపీఎస్‌, Glonass, Beidou, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, వైఫై, బ్లూటూత్‌ v5.3, ఎన్‌ఎఫ్‌సీ, యూడబ్ల్యూబీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
  • కోబాల్ట్‌ వయొలెట్‌, ఆంబర్‌ యెల్లో, ఒనిక్స్‌ బ్లాక్‌, మార్బుల్‌ గ్రే, జేడ్‌ గ్రీన్‌, సఫైర్‌ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

గెలాక్సీ ఎస్‌24+ ఫీచర్లు..

  • 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X LTPO తెర
  • అమెరికా, దక్షిణ కొరియా, చైనాలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌; భారత్‌ సహా ఇతర దేశాల్లో ఎగ్జినోస్‌ 2400 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (7 ఏళ్ల వరకు ఓఎస్‌ అప్‌డేట్లు)
  • వెనుక భాగంలో 50MP ఓఐఎస్‌+ 12MP అల్ట్రావైడ్‌+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్‌ జూమ్‌ లెన్స్‌ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా
  • 45వాట్ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌, 4.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీ
  • యూఎస్‌బీ టైప్‌-సి, జీపీఎస్‌, Glonass, Beidou, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, వైఫై, బ్లూటూత్‌ v5.3, ఎన్‌ఎఫ్‌సీ, యూడబ్ల్యూబీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు 
  • కోబాల్ట్‌ వయొలెట్‌, ఒనిక్స్‌ బ్లాక్‌, జేడ్‌ గ్రీన్‌, సఫైర్‌ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.

సిమ్‌, ఇంటర్నెట్‌ లేకుండా మొబైల్‌లో టీవీ ప్రసారాలు!

గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా ఫీచర్లు..

  • 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X LTPO ఫ్లాట్‌ తెర
  • స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (7 ఏళ్ల వరకు ఓఎస్‌ అప్‌డేట్లు)
  • వెనుక భాగంలో 200MP ఓఐఎస్‌+ 12MP అల్ట్రావైడ్‌+ 50MP 5x టెలిఫొటో OIS+ 10MP 3x పెరిస్కోప్‌ జూమ్‌ లెన్స్‌ కెమెరా, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా
  • 45వాట్ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌, 4.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ
  • యూఎస్‌బీ టైప్‌-సి, జీపీఎస్‌, Glonass, Beidou, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, వైఫై, బ్లూటూత్‌ v5.3, ఎన్‌ఎఫ్‌సీ, యూడబ్ల్యూబీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
  • టైటానియం గ్రే, టైటానియం బ్లాక్‌, టైటానియం వయొలెట్‌, టైటానియం యెల్లో, టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ వేరియంట్లు, ధరలు..

గెలాక్సీ ఎస్‌24- ఎగ్జినోస్‌ 2400..

8GB+256GB - రూ.79,999

8GB+512GB - రూ.89,999

గెలాక్సీ ఎస్‌24+ - ఎగ్జినోస్‌ 2400..

12GB+256GB - రూ.99,999

12GB+512GB - రూ.1,09,999

గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా - స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3..

12GB+256GB - రూ.1,29,999

12GB+512GB - రూ.1,39,999

12GB+1TB - రూ.1,59,999


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని