Samsung: ఏఐ రేసులోకి శాంసంగ్‌.. గాస్‌ పేరుతో సేవలు!

Samsung: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) ఏఐ సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. యూజర్ల పనుల్ని సులభతరం చేయటంలో భాగంగానే గాస్‌ పేరుతో ఏఐ సేవల్ని ఆవిష్కరించింది.

Updated : 15 Nov 2023 14:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) హవా నడుస్తున్న సమయంలో దాదాపు అన్ని సంస్థలు సొంతంగా ‘ఏఐ’ డివైజ్‌లను తయారు చేయటం ప్రారంభించాయి. తాజాగా.. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) కూడా ఏఐ సేవల్ని అందించేందుకు సిద్ధమైంది. యూజర్ల పనుల్ని సులభతరం చేయటంలో భాగంగానే గాస్‌ (Gauss) పేరుతో ఏఐ సేవల్ని ఆవిష్కరించింది.

సియోల్‌లో జరిగిన శాంసంగ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (SDC) వార్షిక టెక్ సమావేశంలో కంపెనీ గాస్‌ ఏఐ మోడల్‌ను లాంచ్‌ చేసింది. గాస్‌ లాంగ్వేజ్‌, గాస్‌ కోడ్‌, గాస్‌ ఇమేజ్‌ వంటి సబ్‌ మోడల్స్‌లో ఏఐ సేవలు రానున్నాయి. ఈమెయిల్స్‌ రాయటం, కంటెంట్‌ను అనువదించటం.. వంటి పనులను సులభతరం చేయటం కోసం ఈ ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. అంతే కాదు ఈ సాంకేతికతో వినియోగదారులు సృజనాత్మక పనులు చేయటానికి సాయపడుతుందని పేర్కొంది. అయితే శాంసంగ్‌ నుంచి రానున్న ట్యాబ్స్‌, స్మార్ట్‌ఫోన్లు, శాంసంగ్‌ ఎస్‌24లో ఈ ఏఐ సేవల్ని తీసుకురానున్నట్లు వెల్లడించింది.

‘WFH అనుమతిస్తున్న కంపెనీల ఆదాయాలే వేగంగా పెరుగుతున్నాయ్‌’

శాంసంగ్‌ ఎస్‌డీసీ ఈవెంట్‌ మొదటిసారి 2014లో ప్రారంభమైంది. భవిష్యత్తులో తీసుకురానున్న సాంకేతికతలు, సేవల గురించి ఏటా జరిగే ఈవెంట్లో ప్రకటిస్తుంది. ఈ ఏడాది జరిగిన ఈవెంట్‌లో ఏఐ సేవల్ని గురించి ప్రస్తావించింది. వీటితో పాటూ గెలాక్సీ మొబైల్స్‌లో యూఐ (UI) ఫీచర్‌లు, నాలెడ్జ్ గ్రాఫ్‌ల గురించి కూడా చర్చించినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని