Truecaller: ట్రూకాలర్‌ అసిస్టెంట్‌.. మీ ఫోన్‌కు కొత్త ఏఐ టూల్‌

స్పామ్‌/స్కామ్‌ కాల్స్‌ను ఆన్సర్‌ చేయాల్సిన అవసరం లేకుండా ట్రూకాలర్‌ (Truecaller) మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Updated : 02 Apr 2024 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ (Truecaller) మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ట్రూకాలర్‌ అసిస్టెంట్‌ (Truecaller Assistant) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ కృత్రిమ మేధ (AI), క్లౌడ్ ఆధారిత సాంకేతికత సాయంతో పనిచేస్తుంది. యూజర్లు అందుబాటులో లేనప్పుడు వారికి బదులుగా ఏఐ అసిస్టెంట్‌ ఫోన్‌కాల్స్‌ మాట్లాడుతుంది. హిందీ, ఆంగ్ల భాషలతో పాటు ఈ రెండు భాషలు కలిపి మాట్లాడే వారి కోసం ‘హింగ్లీష్‌’లో కూడా అందుబాటులో ఉన్నట్లు ట్రూకాలర్‌ తెలిపింది. భవిష్యత్తులో అన్ని భారతీయ భాషల్లో ఈ ఫీచర్‌ను అందబాటులోకి తీసుకొస్తామని కంపెనీ వెల్లడించింది.

అప్పుడే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుంది: ఇన్ఫీ నారాయణ మూర్తి

స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటరాక్టివ్‌ ఆన్సరింగ్ మెషీన్‌లా ఇది పనిచేస్తుంది. ట్రూకాలర్‌ అసిస్టెంట్ ఎనేబుల్‌ చేసిన తర్వాత ఏఐ మాట్లాడే ఫోన్స్‌కాల్స్‌కు సంబంధించిన టెక్ట్స్‌ను యూజర్‌ యాప్‌లో చూడొచ్చు. దీనివల్ల స్పామ్‌/స్కామ్‌ కాల్స్‌ను ఆన్సర్‌ చేయాల్సిన అవసరం ఉండదని కంపెనీ చెబుతోంది. అలాగే, ఏఐ కాల్‌ లిఫ్ట్ చేసిన తర్వాత అది ముఖ్యమైనదని యూజర్‌ భావిస్తే.. మధ్యలో మాట్లాడొచ్చు. గతంలో కాల్‌ హీరో (Call Hero) పేరుతో ఈ ఫీచర్‌ను ట్రూకాలర్‌ అమెరికాలో పరిచయం చేసింది. తాజాగా ట్రూకాలర్‌ అసిస్టెంట్ పేరుతో భారత్‌లోని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేస్తామని కంపెనీ తెలిపింది. భారత్‌లో ట్రూకాలర్‌కు నెలవారీగా 255.4 మిలియన్‌ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని