Vivo V30 Series: 50MP సెల్ఫీ కెమెరాతో వివో వీ30 సిరీస్‌ ఫోన్లు.. ధర, ఫీచర్లివే

Vivo V30 Series | వివో వీ30 సిరీస్‌ ఫోన్లు భారత్‌లో విడుదలయ్యాయి. వీ30, వీ30 ప్రో పేరిట వస్తున్న వీటిలో ముందు భాగంలోనే 50 ఎంపీ కెమెరాను ఇస్తుండడం విశేషం.

Updated : 07 Mar 2024 16:37 IST

Vivo V30 Series | ఇంటర్నెట్‌ డెస్క్‌: వివో వీ30 సిరీస్‌ ఫోన్లు గురువారం భారత్‌లో విడుదలయ్యాయి. వీ30, వీ30 ప్రో పేరిట వస్తున్న వీటిలో ముందు భాగంలోనే 50 ఎంపీ కెమెరాను ఇస్తుండడం విశేషం. వేరియంట్లు, ఇతర ఫీచర్లు, ధర వంటి వివరాలు చూద్దాం..

వీ30 ఫీచర్లు, ధర..

  • 120Hz రీఫ్రెష్‌ రేటు, 2,800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల కర్వ్‌డ్‌ ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ తెర
  • క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 14
  • 50ఎంపీ ఓఐఎస్‌+ 50ఎంపీ వెనుక కెమెరా, 50ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 80 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
  • బ్లూటూత్‌ 5.4, వైఫై 5, ఎన్‌ఎఫ్‌సీ
  • అండమాన్‌ బ్లూ, పీకాక్‌ గ్రీన్‌, క్లాసిక్‌ బ్లాక్‌.. మూడు రంగుల్లో 

ధర..

  • 8GB+128GB - రూ.33,999
  • 8GB+256GB - రూ.35,999
  • 12GB+256GB - రూ.37,999

వీ30ప్రో ఫీచర్లు, ధర..

  • 120Hz రీఫ్రెష్‌ రేటు, 2,800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ తెర
  • మీడియాటెక్‌ డైమెన్సిటీ 8,200 జెన్‌ 5 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 14
  • 50ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ పోర్ట్రెయిట్, 50 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్ కెమెరా ఇచ్చారు. ముందువైపు 50ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 80 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
  • బ్లూటూత్‌ 5.3, వైఫై 5, ఎన్‌ఎఫ్‌సీ
  • అండమాన్‌ బ్లూ, క్లాసిక్‌ బ్లాక్‌.. రెండు రంగుల్లో 

ధర..

  • 8GB+256GB - రూ.41,999
  • 12GB+512GB - రూ.46,999
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని