WhatsApp: వాట్సాప్‌లో త్వరలో ‘సీక్రెట్‌ కోడ్‌’.. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp: వినియోగదారుల వ్యక్తిగత చాట్‌ల గోప్యత కోసం ఇప్పటికే అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ కొత్తగా ‘సీక్రెట్‌ కోడ్‌’ పేరుతో మరో ఫీచర్‌ను తీసుకురానుంది.

Updated : 10 Oct 2023 15:37 IST

Whatsapp Secret code | ఇంటర్నెట్‌డెస్క్‌: యూజర్ల ప్రైవసీకి సంబంధించి ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (Whatsapp) మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. వ్యక్తిగత చాట్‌లను హైడ్‌ చేయడానికి ఇప్పటికే చాట్‌లాక్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంటే మన వ్యక్తిగత వాట్సాప్‌ను ఇతరులు ఓపెన్‌ చేసినా సంబంధిత చాట్‌లు వీక్షించకుండా ఒక పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవడం దీని ఉద్దేశం. దీనికి కొనసాగింపుగా వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత కల్పించేందుకు ‘సీక్రెట్‌ కోడ్‌ (secret code)’ పేరుతో మరో ఫీచర్‌ను తీసుకొస్తోంది.

ఎక్స్‌లో మరో మార్పు.. ఇక రిప్లయ్‌ కష్టమే!

సాధారణంగా ‘చాట్‌ లాక్‌’ ఫీచర్‌తో వ్యక్తిగత చాట్‌లను లాక్‌ వేయవచ్చు. సంబంధిత చాట్‌ను ఓపెన్‌ చేసేటప్పుడు పాస్‌వర్డ్‌/ బయోమెట్రిక్‌  ద్వారా లాగిన్‌ అవ్వాలి. లేదంటే చాట్‌ ఓపెన్‌ అవ్వదు. ‘సీక్రెట్‌ కోడ్‌’ అనేది కాస్త భిన్నం. లాక్‌ చేయాలనుకున్న వ్యక్తిగత చాట్‌లన్నింటినీ సీక్రెట్‌కోడ్‌ ద్వారా లాక్‌ చేసేయెచ్చు. వాట్సాప్‌ సెర్చ్‌ బార్‌లో ఎంటర్‌ చేయగానే లాక్‌ వేసిన చాట్స్‌ ఓపెన్‌ అవుతాయి. ఆ కోడ్‌ను సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ABC123 అని పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకుంటే.. సెర్చ్‌ బార్‌లో ఆ కోడ్‌ ఎంటర్‌ చేయగానే లాక్‌లో ఉన్న చాట్‌లన్నీ ఓపెన్‌ అవుతాయి. అక్షరాలు, ఎమోజీలు ఏవైనా సీక్రెట్‌ కోడ్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని