WhatsApp: డిస్‌అప్పియర్‌ మెసేజెస్‌ అప్‌డేట్‌.. కొత్తగా మరో 15 టైమ్‌ ఆప్షన్లు!

వాట్సాప్‌ (WhatsApp) యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ అప్‌డేట్‌ అందుబాటులోకి రానుంది. డిస్‌అప్పియరింగ్ మెసేజెస్‌ (Disappearing Messages)లో ప్రస్తుతం ఉన్న టైమ్‌ ఆప్షన్లకు అదనంగా మరో 15 టైమ్‌ ఆప్షన్లను పరిచయంకానున్నాయి. 

Published : 31 Mar 2023 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎడిట్‌ మెసేజ్‌ (Edit Message), ఆడియో చాట్స్‌ (Audio Chats), వ్యూ వన్స్‌ ఆడియో (View Once Audio) వంటి ఫీచర్లను పరీక్షిస్తోంది. తాజాగా మరో ఫీచర్‌ను అప్‌డేట్‌ చేయనుంది. 2020లో పరిచయం చేసిన డిస్‌అప్పియరింగ్‌ మెసేజెస్‌ (Disappearing Messages) ఫీచర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ వస్తోన్న వాట్సాప్‌.. మరోసారి ఈ ఫీచర్‌లో మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా డిస్‌అప్పియరింగ్ ఫీచర్‌లో ప్రస్తుతం ఉన్న టైమ్‌ ఆప్షన్లకు అదనంగా మరో 15 ఆప్షన్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అదనపు ఆప్షన్లతో యూజర్లు వాట్సాప్ ద్వారా జరిపితే ముఖ్యమైన సంభాషణలు త్వరగా డిలీట్‌ అయిపోవడంతోపాటు, వాటిని ఇతరులు చూడలేరని వాట్సాప్ భావిస్తోంది. 

వాట్సాప్‌ డిస్‌అప్పియరింగ్‌ ఫీచర్‌లో ప్రస్తుతం 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజుల టైమ్‌ ఆప్షన్లు ఉన్నాయి. అంటే యూజర్‌ డిస్‌అప్పియరింగ్ ఆప్షన్‌ను ఆన్‌ చేసి మూడు టైమ్‌ లిమిట్‌లలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవాలి. ఉదాహరణకు ఏడు రోజుల టైమ్‌ ఆప్షన్‌ను ఎంచుకుని మెసేజ్‌ పంపితే.. అవతలి వ్యక్తి ఆ మెసేజ్‌ చూసిన ఏడు రోజుల తర్వాత వాటంతటవే డిలీట్‌ అయిపోతాయి. ప్రస్తుతం ఉన్న మూడు టైమ్‌ ఆప్షన్లకు మరో 15 ఆప్షన్లను యూజర్లకు వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా రాబోయే ఆప్షన్లలో ఒక గంట నుంచి ఒక ఏడాది వరకు వేర్వేరుగా ఉంటాయని సమాచారం. డిస్‌అప్పియరింగ్‌ మెసేజెస్‌ ఆన్‌ చేసిన తర్వాత అందులో మోర్‌ ఆప్షన్‌లో కొత్తగా పరిచయం చేయనున్న టైమ్‌ ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని