Whatsapp: ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్‌ బంద్‌.. లిస్ట్‌ ఇదిగో..

WhatsApp to stop working on these phones: కొన్ని పాత డివైజుల్లో వాట్సప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. అక్టోబర్‌ 24 నుంచి ఎంపిక చేసిన డివైజుల్లో వాట్సప్‌ మూగబోనుంది.

Published : 25 Sep 2023 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (Whatsapp) ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను జోడిస్తోంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, వెబ్‌ వెర్షన్‌ వాడే యూజర్లకు సెక్యూరిటీ పరంగా అప్‌డేట్లనూ అందిస్తూ ఉంటుంది. అదే సమయంలో పాతతరం ఆపరేటింగ్‌ సిస్టమ్‌లు వాడే డివైజులకు తన సపోర్ట్‌ నిలిపివేస్తూ ఉంటుంది. తాజాగా ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌ వాడుతున్న వెర్షన్‌ ఫోన్లకు సపోర్ట్‌ నిలిపివేస్తున్నట్లు వాట్సప్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 24 నుంచి ఇది అమల్లోకి రానుంది.

ఏటా మాదిరిగానే పాత తరం, అతి తక్కువ మంది వాడే డివైజులకు సపోర్ట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు వాట్సప్‌ తెలిపింది. అన్ని టెక్నాలజీ కంపెనీలూ అదే పనిచేస్తున్నాయని పేర్కొంది. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ 4.1 ఓఎస్‌, అంతకంటే తక్కువ వెర్షన్‌తో పనిచేస్తున్న కొన్ని ఫోన్లను లిస్ట్‌ చేసింది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లు, ట్యాబ్‌లు పెద్దగా వాడుకలో లేన్పటికీ.. ఒకవేళ ఎవరైనా వాడుతున్నట్లయితే కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సప్‌ సపోర్ట్‌ నిలిచిపోతే ఇకపై ఆయా ఫోన్లకు సందేశాలు నిలిచిపోతాయి. అయితే, పాత డివైజులు అయినప్పటికీ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 5.0, ఐఫోన్‌ 12, కాయ్‌ ఓఎస్‌ 2.5.0 (జియో ఫోన్లు) ఓఎస్‌లతో నడుస్తున్న డివైజుల్లో వాట్సప్‌ సేవలు మున్ముందూ కొనసాగుతాయి.

గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్‌!

జాబితా ఇదే..

నెక్సస్‌ 7, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 2, హెచ్‌టీసీ వన్‌, సోనీ ఎక్స్‌పీరియా జడ్‌, ఎల్‌జీ ఆప్టిమస్‌ జీ ప్రో, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌2, శాంసంగ్‌ గెలాక్సీ నెక్సస్‌, హెచ్‌టీసీ సెన్సేషన్‌, మోటోరొలా డ్రాయిడ్‌ రేజర్‌, సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌2, మోటోరొలా జూమ్‌, శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్ 10.1, ఆసుస్‌ ఈ ప్యాడ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, ఏసర్‌ ఐసోనియా ట్యాబ్‌ ఏ5003, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌, హెచ్‌టీసీ డిజైర్‌ హెచ్‌డీ, ఎల్‌జీ ఆప్టిమస్‌ 2 ఎక్స్‌, సోనీ ఎరిక్సన్ ఎక్స్‌పీరియా ఆర్క్‌3 ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని