YouTube: విశ్వసనీయ వార్తల కోసం యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌!

YouTube: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ మొబైల్‌ యూజర్ల కోసం ‘న్యూస్‌ స్టోరీ’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

Published : 19 Oct 2023 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ (YouTube) మొబైల్‌ యూజర్ల కోసం మరో  ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ‘వాచ్‌ పేజ్‌’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్‌ వార్తల ఫీడ్‌లానే ఈ ఫీచర్‌ కూడా ఉండనుందని యూట్యూబ్‌ తెలిపింది. ఫేక్‌ న్యూస్‌ను అరికట్టి విశ్వసనీయ వార్తలను యూజర్లకు అందించడంలో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల యూట్యూబ్‌లో ఫేక్‌ ఛానెళ్లను అరికట్టాలని సూచించింది. ఈ పరిణామం తర్వాత యూట్యూబ్‌ నుంచి తాజా ప్రకటన వెలువడడం గమనార్హం.

గూగుల్‌ ఓపెన్‌ చేయగానే మనం తరచూ వీక్షించే కంటెంట్‌ ఆధారంగా కొన్ని వార్తల వీడియోలు, వార్తా కథనాలు, ఇతర టెక్ట్స్‌ ఆధారిత కంటెంట్‌ ఫీడ్‌లో దర్శనమిస్తాయి. అదే తరహాలో విశ్వసనీయ వార్తలను సైతం అందించడం కోసం కోసం ‘వాచ్‌ పేజీ’ని తీసుకురానున్నట్లు యూట్యూబ్ ఇండియా పబ్లిక్ పాలసీ అధిపతి మీరా ఛత్‌ తెలిపారు. గురువారం జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

సెకండ్‌ హ్యాండ్‌ స్మార్ట్‌ఫోన్లను పెరిగిన గిరాకీ: రీసెర్చ్‌ నివేదిక

కొత్త వాచ్‌ పేజ్‌ ఫీచర్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ, యూట్యూబ్ ఒక చిన్న వీడియో డెమోను కూడా విడుదల చేసింది. ఆ వీడియోను యూట్యూబ్‌ తన అధికారిక బ్లాగ్‌లలో ఉంచింది. భారత్‌లో రానున్న నెలల్లో ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుందని యూట్యూబ్‌ వెల్లడించింది. 2023 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య భారత్‌లో తమ నిబంధనలను ఉల్లంఘించిన 2 మిలియన్లకు పైగా వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని