Zomato Xtreme: జొమాటో కొత్త సర్వీసు.. వారికి మాత్రమే!

Zomato Xtreme: జొమాటో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. వ్యాపారుల కోసం లాజిస్టిక్‌ సేవలను ప్రారంభించింది. ఇందుకు డెలివరీ పార్ట్‌నర్లను వినియోగించుకోనుంది.

Published : 13 Oct 2023 16:29 IST

Zomato Xtreme | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో (Zomato) కొత్త వ్యాపార విభాగంలోకి అడుగుపెట్టింది. ఎక్స్‌ట్రీమ్‌ పేరిట (Zomato Xtreme) పార్శిల్‌ సర్వీసులను ప్రారంభించింది. వ్యాపారుల కోసం ఈ సర్వీసును తీసుకొచ్చింది. చిన్న చిన్న పార్శిళ్లను కస్టమర్లకు పంపించడం లేదా స్వీకరించడం కోసం డెలివరీ పార్ట్‌నర్ల సేవలను జొమాటో వినియోగించుకోనుంది.

చిన్న వ్యాపారులు మొదలు, పెద్ద రిటైలర్ల వరకు ఎవరైనా ఈ పార్శిల్‌ డెలివరీ సేవలను వినియోగించుకోవచ్చని జొమాటో ఎక్స్‌ట్రీమ్‌ పేర్కొంది. ఇప్పటికే 3 లక్షల మంది డెలివరీ పార్ట్‌నర్లు ఎక్స్‌ట్రీమ్‌ సేవల్లో భాగస్వాములుగా ఉన్నారని తెలిపింది. నగరాల పరిధిలో 10 కిలోమీటర్ల వరకు ప్యాకేజీలను పంపించుకోవచ్చని, రూ.35 నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని జొమాటో పేర్కొంది. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా జొమాటో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.

యూపీఐ పేమెంట్‌ ఫీచర్‌తో జియోభారత్‌ కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లివే!

ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రస్తుతం దీనికి సంబంధించి యాప్‌ అందుబాటులో ఉంది. యాపిల్‌ యూజర్లకు యాప్‌ అందుబాటులో లేదు. మరోవైపు స్విగ్గీ ఇప్పటికే స్విగ్గీ జీని పేరుతో హైపర్‌ లోకల్‌ డెలివరీ సేవలను అందిస్తోంది. కస్టమర్లు కూడా ఈ సేవలు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో జొమాటో వ్యాపారుల కోసం ఎక్స్‌ట్రీమ్ సేవలను ప్రారంభించడం గమనార్హం. భవిష్యత్‌లో సాధారణ వినియోగదారులకూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తారా? లేదా? అనేది తెలియరాలేదు.

వెజ్‌ బదులు నాన్‌ వెజ్‌.. ₹లక్ష ఫైన్‌

వెజ్‌ బదులు నాన్‌ వెజ్‌ ఆహార పదార్థాన్ని డెలివరీ చేసినందుకు గానూ జొమాటో, మెక్‌ డోనాల్డ్స్‌ సంస్థలకు కలిపి రూ.లక్ష రూపాయలు జరిమానా పడింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వినియోగదారుల ఫోరం ఈ మేరకు జరిమానా విధించింది. ఈ విషయాన్ని జొమాటో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని