ED: వివో కేసులో లావా ఎండీ అరెస్టు!

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివోపై జరుగుతున్న మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా నలుగురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Updated : 11 Oct 2023 07:57 IST

మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్న ఈడీ

దిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివోపై జరుగుతున్న మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా నలుగురు వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరిలో లావా ఇంటర్నేషనల్‌ మొబైల్‌ కంపెనీ ఎండీ హరి ఓం రాయ్‌తో పాటు ఓ చైనా వ్యక్తి గాంగ్‌వెన్‌ క్యాంగ్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నితిన్‌ గార్గ్‌, రాజన్‌ మాలిక్‌ అనే మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద వాళ్లను కస్టడీలోకి తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామంపై స్పందన కోసం లావా ఇంటర్నేషనల్‌ను ఇ-మెయిల్‌ ద్వారా సంప్రదించగా.. ఎటువంటి సమాధానం రాలేదు. లావా ఇంటర్నేషనల్‌.. దేశీయ మొబైల్‌ తయారీ కంపెనీ. స్మార్ట్‌ఫోన్‌ విపణిలో ఈ సంస్థ వాటా 1-2 శాతం వరకు ఉంటుందని అంచనా. వివో ప్రాంగణాలతో పాటు సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో గతేడాది జులైలో తనికీలు జరిపిన ఈడీ.. చైనా సంస్థలతో పాటు పలు భారతీయ సంస్థల ప్రమేయం ఉన్న భారీ మొత్తంతో కూడిన మనీలాండరింగ్‌ నిధుల గుట్టును బట్టబయలు చేసింది. భారత్‌లో పన్ను చెల్లింపులను ఎగ్టొట్టేందుకు చైనాకు వివో అక్రమంగా రూ.62,476 కోట్లను బదిలీ చేసిందని ఈడీ ఆ సమయంలో ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని