ఈక్విటీలు.. రుణ పత్రాల్లో

వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ ముగింపు తేదీ వచ్చే నెల 3. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి.

Published : 27 Jan 2023 00:08 IST

వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌

వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ అనే ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ ముగింపు తేదీ వచ్చే నెల 3. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. ఇది ఓపెన్‌ ఎండెడ్‌, డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ తరగతికి చెందిన పథకం. అంటే 65 శాతానికిపైగా పెట్టుబడులను ఈక్విటీ షేర్లకు కేటాయిస్తారు. మిగిలిన సొమ్ము రుణ పత్రాల్లో ఉంటుంది. తద్వారా అటు పెట్టుబడుల వృద్ధి, ఇటు కొంత వడ్డీ ఆదాయం లభిస్తుందన్నమాట. తక్కువ నష్టభయంతో స్థిరమైన ఆదాయాలు నమోదు చేసే అవకాశం ఇలాంటి పథకాలకు ఉంటుంది. ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్లు రమేష్‌ మంత్రి, తృప్తి అగ్రవాల్‌, పియూష్‌ బరన్వాల్‌. క్రిసిల్‌ హైబ్రీడ్‌ 50+ 50 మోడరేట్‌ ఇండెక్స్‌ను ఈ ఫండ్‌ పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.
బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు దేశీయ మ్యూచువల్‌ ఫండ్ల మార్కెట్లో ఎంతో ఆదరణ కల విభాగం కావటం గమనార్హం. గత ఏడాది కాలంలో బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లలోకి దాదాపు రూ.11,600 కోట్ల పెట్టుబడి లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎడెల్‌వైజ్‌, బీఎన్‌పీ పారిబస్‌... తదితర అగ్రశ్రేణి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ పథకాలను నిర్వహిస్తున్నాయి. ఈ విభాగంలోకి వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా అడుగుపెట్టింది. సాధారణంగా ఇటువంటి పథకాల్లో కనీసం అయిదేళ్ల పాటు తమ పెట్టుబడులను కొనసాగిస్తేనే తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇతర ఈక్విటీ పథకాలతో పోలిస్తే నష్టభయం తక్కువ. అధిక లాభాలూ రాకపోవచ్చు.


స్థిరమైన వడ్డీ కోసం

డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే డీఎస్‌పీ నిఫ్టీ ఎస్‌డీఎల్‌ ప్లస్‌ జీ-సెక్‌ 2027 50: 50 ఇండెక్స్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. సమీకరించిన నిధులను కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వాల రుణ పత్రాల్లో మదుపు చేస్తారు.   2027 సెప్టెంబరు నాటికి కాలవ్యవధి తీరే  పత్రాలను ఎంచుకుంటారు. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 8. కనీస పెట్టుబడి రూ.500. ఈ పథకంలో పెద్దగా నష్టభయం ఉండదు. స్థిరమైన వడ్డీ ఆదాయం లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు