రూ.520తో రూ.10 లక్షల బీమా

ప్రమాదాలు చెప్పి రావు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే గాయాలతో బయటపడితే ఫర్వాలేదు. మృత్యువాత పడితే ఆ లోటు తీర్చలేనిది. ఆయా కుటుంబాల వేదన వర్ణనాతీతం

Updated : 29 Dec 2023 09:15 IST

ప్రమాదాలు చెప్పి రావు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే గాయాలతో బయటపడితే ఫర్వాలేదు. మృత్యువాత పడితే ఆ లోటు తీర్చలేనిది. ఆయా కుటుంబాల వేదన వర్ణనాతీతం. కాబట్టి, ప్రతి ఒక్కరూ ప్రమాద బీమా చేసుకోవాలని తపాలా శాఖ సూచిస్తోంది.

  • రూ.755 చెల్లిస్తే... నివా బూపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో కలిసి తపాలాశాఖ అందిస్తున్న బీమాలో ఏడాదికి రూ.755 చెల్లించి చేరవచ్చు. ప్రమాదంలో మృతి చెందితే నామినీకి రూ.15లక్షలు అందుతాయి. శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ. 15 లక్షలు అందుతాయి. ప్రమాదంలో వైద్య ఖర్చులు రూ. లక్ష అందజేస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యం అందితే రోజుకు రూ.1000, ఐసీయూలో ఉంటే రూ.2 వేలు అందిస్తారు. ఒకవేళ చేయి, కాలు ఏదైనా విరిగిపోతే  రూ.25,000 ఇస్తారు. పాలసీదారు చనిపోతే.. పిల్లల విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష ఇస్తారు. పిల్లల పెళ్లికి రూ. లక్ష అందజేస్తారు.  
  •  టాటా ఏఐజీతో కలిసి.. టాటా ఏఐజీతో కలిసి తపాలా శాఖ అందిస్తున్న బీమాలో రూ.520 చెల్లించి చేరవచ్చు.  ప్రమాదంలో మృతి చెందితే నామినీకి రూ. 10 లక్షలు అందుతాయి. శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ. 10 లక్షలు అందుతాయి.  ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చులలో రూ.లక్ష ఇస్తారు. పాలసీదారు చనిపోతే.. పిల్లల విద్యా ప్రయోజనాలకు రూ.లక్ష ఇస్తారు.  
  • ఏడాదికి రూ. 320: తపాలా శాఖ, టాటా ఏఐజీ కలిసి అందిస్తున్న బీమాలో రూ. 320 చెల్లించి చేరవచ్చు. పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి రూ. 5 లక్షలు అందుతాయి. శాశ్వత వైకల్యంతో పాటు శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడినా రూ.5 లక్షలు అందుతాయి. ఆసుపత్రిలో చేరాక వైద్య ఖర్చులలో రూ. 50 వేలు ఇస్తారు.
  • ‘ఈ ప్రమాద బీమా పాలసీలను 18-65 ఏళ్ల వారు తీసుకోవచ్చు. ఈ పాలసీలు తీసుకోవాలంటే ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)లో ఖాతా ప్రారంభించాలి. రూ.100తోనే దీన్ని ప్రారంభించే వీలుంది’ అని తపాలా శాఖ సికింద్రాబాద్‌ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ సుబ్రమణ్యం చెప్పారు. తపాలా శాఖ కార్యాలయంలో ఎక్కడైనా ఈ పథకంలో చేరవచ్చని చెప్పారు.

ఎల్‌.వేణుగోపాలనాయుడు, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని