స్థిరాస్తి రంగంలో...

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 21న ముగుస్తుంది.

Published : 15 Mar 2024 01:16 IST

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్‌ ఫండ్‌ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.100. ఇది ఇండెక్స్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. దీర్ఘకాలంలో రియాల్టీ కంపెనీలు ఆకర్షణీయమైన లాభాలు ఆర్జిస్తాయని, ఈ రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి, మదుపరులకు అధిక ప్రతిఫలాన్ని సంపాదించాలనేది ఈ పథకం లక్ష్యం. తమ పెట్టుబడుల్లో కొంత వైవిధ్యం ఉండాలని, ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పరోక్షంగా మదుపు చేయాలనుకునే వారికి ఈ పథకం అనువుగా ఉంటుంది.


స్థిరమైన రాబడి కోసం..

 హీలియోస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నూతన బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. హీలియోస్‌ బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌- అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 20న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది హైబ్రిడ్‌ పథకం. అటు రుణ పత్రాల్లో, ఇటు ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టి తక్కువ హెచ్చు  తగ్గులతో స్థిరమైన రాబడిని ఆర్జించటం ఈ పథకం ప్రధాన మదుపు వ్యూహం. లాభాలపై ఈక్విటీ తరగతికి వర్తించే మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఇప్పటికే పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఈ తరహా పథకాలను అందిస్తున్నాయి. గత కొంతకాలంగా ఈ పథకాలపై ఆకర్షణీయమైన లాభాలు నమోదవుతున్నాయి.


ఐటీ సంస్థల్లో..

నవీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి నవీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఈ పథకం పనితీరుకు కొలమానంగా ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 22న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.10. ప్రధానంగా ఐటీ కంపెనీలతో పోర్ట్‌ఫోలియో నిర్మిస్తారు. ఇటీవలి కాలంలో ఐటీ కంపెనీల ఆదాయాలు, లాభాలపై ఒత్తిడి కనిపిస్తున్న విషయం విదితమే. అందువల్ల ఐటీ కంపెనీల షేర్ల ధరలూ ఆకర్షణీయంగా పెరగలేదు. కానీ, ఏఐ/ఎంఎల్‌, డేటా అనలటిక్స్‌ వంటి కొత్త ప్రోగ్రాములతో ఐటీ కంపెనీలు భవిష్యత్తులో మళ్లీ వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అందువల్ల దీర్ఘకాలం పాటు కొనసాగే వ్యూహంతో ఉన్న మదుపరులకు ఐటీ రంగంలో పెట్టుబడులకు ఇది మంచి తరుణమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని