Consumer Rights: బరువు తగ్గలేదు.. పరిహారం చెల్లించాల్సిందే!

వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా చెల్లించిన ఫీజు వడ్డీతో, పరిహారం చెల్లించాలని కమిషన్‌-3 కలర్స్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను ఆదేశించింది.

Published : 18 Jul 2022 12:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: అధిక బరువుతో బాధపడుతున్నారా..? కొన్ని రోజుల్లోనే నాజుకైన శరీరం మీ సొంతమవుతుందన్న ప్రకటన చూసి వనపర్తి విద్యార్థిని రుక్సర్‌నాజ్‌ మోసపోయింది. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా చెల్లించిన ఫీజు వడ్డీతో, పరిహారం చెల్లించాలని కమిషన్‌-3 కలర్స్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ను ఆదేశించింది. ఫిర్యాదుదారు పెళ్లి కుదరడానికి అధిక బరువు సమస్యగా మారడంతో అత్తాపూర్‌లోని ప్రతివాద సంస్థను సంప్రదించింది. రూ.80వేలు చెల్లించి చికిత్స తీసుకుంటే 20 కిలోల బరువు తగ్గుతావని ఆ సంస్థవారు చెప్పారు. మూడు నెలల్లో ఫలితం లేకపోవడంతో తన డబ్బు తిరిగి చెల్లించాలని కోరగా సంస్థ స్పందించలేదు. ఫిర్యాదుపై విచారించిన కమిషన్‌-3 బెంచ్‌ సాక్ష్యాలు పరిశీలించి రూ.80వేలు, 12 శాతం వడ్డీతో, పరిహారం రూ.10వేలు, ఖర్చులు రూ.5వేలు చెల్లించాలని కలర్స్‌ను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని