LIC - Google Pay: గూగుల్‌ పేతో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించండిలా!

గూగుల్‌ పే (Google Pay) యాప్‌ ద్వారా LIC ప్రీమియం ఎలా చెల్లించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 27 Jan 2023 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యూపీఐ చెల్లింపుల కోసం తరచుగా వాడే గూగుల్‌ పే (Google Pay) ద్వారా ఎల్‌ఐపీ ప్రీమియంను చెల్లించొచ్చని తెలుసా? లాగిన్‌లు లాంటి జంఝాటం లేకుండానే గూగుల్‌ పే ద్వారానే పని పూర్తి చేసేయొచ్చు. 

చెల్లింపులు చేసే విధానం

  • ముందుగా గూగుల్‌పే యాప్‌లో లాగిన్‌ అయ్యి, బిల్లు చెల్లింపులు విభాగానికి వెళ్లాలి. 
  • ‘ఫైనాన్స్‌ & ట్యాక్సెస్‌’ విభాగంలో బీమాను ఎంపిక చేసుకోవాలి. 
  • అందుబాటులో ఉన్న జాబితా నుంచి ‘LIC’ను ఎంపిక చేసుకోవాలి. 
  • పాలసీ నంబరు తదితర వివరాలు ఇచ్చి ఎల్‌ఐసీ ఖాతాను యాడ్‌ చేసుకోవాలి. 
  • ఖాతాను లింక్‌ చేసిన తర్వాత, యూపీఐ పిన్‌ ఇచ్చి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. 
  • అప్పటికే తాజా విడత ప్రీమియం చెల్లించేసి ఉంటే.. పెండింగ్‌ లేదు అని చూపిస్తుంది.
  • యూపీఐ ద్వారా ప్రీమియం చెల్లింపులను అంగీకరించే ముందు ఈ-మెయిల్‌ ఐడీ అడుగుతుంది.
  • చెల్లింపులను స్వీకరించిన తర్వాత సంబంధిత రశీదు ఈ-మెయిల్‌కు వస్తుంది. 

గమనిక: ఫోన్‌ పే, పేటీఎం లాంటి యాప్స్‌ ద్వారా కూడా ప్రీమియమ్‌లు చెల్లించొచ్చు. వాటి ప్రాసెస్‌ కూడా దాదాపుగా ఇలానే ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని