Tech Tip: కొత్త ఫోన్‌ కొన్నారా? బ్యాకప్‌ అవసరం లేకుండానే వాట్సప్‌ చాట్‌ ట్రాన్స్‌ఫర్‌

Tech Tip: బ్యాకప్‌తో సంబంధం లేకుండా వాట్సప్‌ చాట్‌ మొత్తాన్ని కొత్త మొబైల్‌కి బదిలీ చేసుకోవచ్చని తెలుసా? అదెలా చేయాలో ఇప్పుడు చూద్దాం.. 

Updated : 28 Jan 2024 16:57 IST

WhatsApp Tech Tip | ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం వినియోగించే వాట్సప్‌లో (WhatsApp) ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. రోజుల తరబడి వాడినప్పుడు ఇందులోని సమాచారం పెద్ద మొత్తంలో పోగుబడి ఉంటుంది. ఒకవేళ కొత్త మొబైల్‌ కొన్నప్పుడు ఈ డేటా అవసరం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో పాత మొబైల్‌లోని డేటా మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు బ్యాకప్‌ (backup) ఆప్షన్‌ను వినియోగిస్తుంటాం. మళ్లీ కొత్త ఫోన్‌లో రీస్టోర్‌ చేస్తుంటాం. ఇలా బ్యాకప్‌ చేయకుండా కూడా వాట్సప్‌లోని చాట్‌ హిస్టరీని కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు. ఇందుకోసం వాట్సప్‌ చాట్ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే బ్యాకప్‌ కంటే ఈ ప్రక్రియ చాలా వేగంగానూ, సులభంగానూ ఉంటుంది. ఇందుకోసం రెండు (పాత, కొత్త) ఫోన్లూ మీ వద్దే ఉండాలి. అవి రెండు ఒకే వైఫైకి కనెక్ట్‌ అయ్యి ఉండడంతో పాటు, లొకేషన్‌ సర్వీసు కూడా ఆన్‌లో ఉంచాలి.

ట్రాన్స్‌ఫర్‌ ఇలా..

  •  ముందు మీ పాత ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
  •  చాట్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  •  చాట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ మీ పాత ఫోన్‌లో ప్రారంభం అవుతుంది. ఇక్కడో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.
  •  తర్వాత కొత్త ఫోన్‌లో వాట్సప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలి. అదే ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి.
  •  పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త దాంట్లో ఎంటర్‌ చేయాలి.
  •  కొత్త ఫోన్‌లో చూపించే క్యూఆర్‌ కోడ్‌ను పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయాలి.
  •  ఆ తర్వాత పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి బదిలీ అవుతుంది.
  •  కొన్ని నిమిషాల పాటు కొనసాగే ఈ ప్రక్రియ సమయంలో రెండు ఫోన్లూ పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్‌లూ ఆన్‌లోనే ఉంచాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని