Jio: ఇకపై జియో కనీస రీఛార్జ్‌ ప్లాన్‌ ధర ₹149

ప్రీపెయిడ్‌లో ఇప్పటి ప్రాథమిక రీఛార్జ్‌ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU) పెంచుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated : 24 Aug 2023 19:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) యూజర్లకు షాకిచ్చింది. ప్రీపెయిడ్‌లో ఇప్పటి ప్రాథమిక రీఛార్జ్‌ ప్లాన్‌గా ఉన్న రూ.119 ప్లాన్‌ను నిలిపివేసింది. దీంతో జియో యూజర్లు ప్రాథమిక రీఛార్జి కోసం రూ.149తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో జియో ప్రీపెయిడ్‌లో రూ.119 ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్‌గా ఉండేది. దీంతో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు 14 రోజుల అపరిమిత కాలింగ్‌తోపాటు, రోజుకు 1.5 జీబీ డేటా, వంద మెసేజ్‌లు అందించేది.

ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం (ARPU) పెంచుకునే క్రమంలో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు దాని స్థానంలో రూ.149 రీఛార్జ్ ప్లాన్‌లో 20 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ డేటాతోపాటు, 100 ఎస్సెమ్మెస్‌లను అందిస్తోంది. వీటికి అదనంగా జియో యూజర్లకు జియో సినిమా, జియో టీవీ యాప్‌లలో కార్యక్రమాలను వీక్షించవచ్చు. అయితే, ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీ డేటా మాత్రం ఉండదు.

టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 140 km

కొద్దిరోజుల క్రితం ప్రీపెయిడ్‌ యూజర్ల కోసం నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్లాన్లను జియో తీసుకొచ్చింది. ఇందులో ఒక ప్లాన్‌ ధర రూ.1099గా నిర్ణయించింది. ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌ లభిస్తుంది. జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.1499. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత కాల్స్‌, రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ (బేసిక్‌) లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచిత 5జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.149 కాగా.. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.199 గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని