JioDive VR Headset: వర్చువల్‌ రియాలిటీలో ఐపీఎల్‌.. జియో నుంచి ప్రత్యేక హెడ్‌సెట్‌

JioDive VR Headset: జియోసినిమాలో ఐపీఎల్‌ను వీక్షిస్తున్న వారికోసం ప్రత్యేక హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. వర్చువల్‌ రియాలిటీలో మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేయాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జియో తెలిపింది.

Published : 02 May 2023 15:25 IST

JioDive VR Headset | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ 2023ని వర్చువల్‌ రియాలిటీలో వీక్షించేందుకు వీలుగా జియో ప్రత్యేక వీఆర్‌ హెడ్‌సెట్‌ను విడుదల చేసింది. జియోసినిమా యాప్‌లో ఐపీఎల్‌ (IPL 2023) వీక్షిస్తున్నవారు జియోడైవ్‌ (JioDive VR Headset) పేరిట తీసుకొచ్చిన ఈ హెడ్‌సెట్‌ను ఉపయోగించుకోవచ్చు. 100 అంగుళాల వర్చువల్‌ స్క్రీన్‌, 360 డిగ్రీల వ్యూలో మ్యాచ్‌లను వీక్షించొచ్చు. అయితే, ఇది కేవలం జియో యూజర్లకు మాత్రమే.

జియోడైవ్‌ ధర..
(JioDive VR Headset Price)

జియోడైవ్‌ హెడ్‌సెట్‌ (JioDive VR Headset) ధర భారత్‌లో రూ.1,299. జియోమార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. పేటీఎం వ్యాలెట్‌ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. 

జియోడైవ్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
(JioDive VR Headset Specifications)

కేవలం జియో యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ హెడ్‌సెట్‌ (JioDive VR Headset)తో 100 అంగుళాల వర్చువల్‌ స్క్రీన్‌లో 360 డిగ్రీల వ్యూలో మ్యాచ్‌లను వీక్షించొచ్చు. ఆండ్రాయిడ్‌ 9, ఐఓఓస్‌ 15తో పాటు ఆ తర్వాత వచ్చిన ఓఎస్‌తో నడిచే ఫోన్లలో ఇది పనిచేస్తుంది. ఫోన్‌ తెర పరిమాణం 4.7 నుంచి 6.7 అంగుళాల మధ్య ఉండాలి. అలాగే గైరోస్కోప్‌, యాక్సెలెరోమీటర్‌ కూడా ఫోన్‌లో తప్పనిసరి. మరింత మెరుగైన వీక్షణ కోసం యూజర్లు లెన్స్‌లను సర్దుబాటు చేసుకునేందుకు హెడ్‌సెట్‌ (JioDive VR Headset)లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. దీన్ని ఉపయోగించాలంటే కచ్చితంగా జియోఇమ్మర్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

జియోడైవ్‌ వీఆర్‌ హెడ్‌సెట్‌ ఎలా ఉపయోగించాలి..

  • జియోడైవ్‌ హెడ్‌సెట్‌ కొనుగోలు చేస్తే వచ్చిన బాక్స్‌పై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి జియోఇమ్మర్స్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • కావాల్సిన పర్మిషన్లు ఇస్తూ లాగిన్‌ అవ్వాలి. కచ్చితంగా జియో నెట్‌వర్క్‌కు మాత్రమే కనెక్ట్‌ అయ్యి ఉండాలి.
  • జియోడైవ్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకొని ‘వాచ్‌ ఆన్‌ జియోడైవ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • హెడ్‌సెట్‌ ముందు కవర్‌ను ఓపెన్‌ చేసి ఫోన్‌ను సపోర్ట్‌ క్లిప్‌, లెన్స్‌ల మధ్య అమర్చాలి. తర్వాత తిరిగి కవర్‌ను మూసేయాలి.
  • జియోడైవ్‌ హెడ్‌సెట్‌ను తలకు పెట్టుకొని వీక్షణకు అనుగుణంగా లెన్స్‌లను సర్దుబాటు చేసుకొని మ్యాచ్‌లను ఎంజాయ్‌ చేయొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని