Maruti Suzuki: మారుతీ సుజుకీ కస్టమర్లకు అలర్ట్‌.. 87 వేల కార్లు రీకాల్‌

Maruti Suzuki Recall: మారుతీ సుజుకీ 87 వేలకు పైగా కార్లను రీకాల్‌ చేస్తోంది. ఎస్‌-ప్రెస్సో, ఈకో మోడళ్లకు ఈ రీకాల్‌ వర్తిస్తుంది.

Published : 24 Jul 2023 19:47 IST

దిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki) భారీ సంఖ్యలో కార్లను రీకాల్‌ చేస్తోంది. ఎస్‌-ప్రెస్సో (S-Presso), ఈకో (Eeco) మోడళ్లకు చెందిన 87,599 యూనిట్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. స్టీరింగ్‌ టై రాడ్‌లో లోపాన్ని సరిచేసేందుకు గానూ రీకాల్‌ చేసినట్లు తెలిపింది. 2021 జులై 5 నుంచి 2023 ఫిబ్రవరి 15 మధ్య తయారైన కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఉద్యోగులకు స్విగ్గీ గుడ్‌న్యూస్‌.. స్టాక్‌ ఆప్షన్ల బైబ్యాక్‌

ఎస్‌-ప్రెస్సో, ఈకో మోడళ్లకు చెందిన కొన్ని వాహనాల్లో వినియోగించిన స్టీరింగ్‌ రాడ్‌లో లోపం ఉన్నట్లు అనుమానిస్తున్నామని మారుతీ సుజుకీ తెలిపింది. ఈ లోపం వల్ల కొన్ని సందర్భాల్లో స్టీరింగ్‌ కంట్రోల్‌ తప్పే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ అధీకృత డీలర్ల నుంచి వినియోగదారులకు వ్యక్తిగతంగా సమాచారం అందుతుందని తెలిపింది. వాహనాన్ని తనిఖీ చేసి ఏదైనా లోపం ఉంటే వెంటనే సరిచేస్తామని, రీప్లేస్‌మెంట్‌ ఉచితమని కంపెనీ పేర్కొంది. జులై 24 నుంచే ఈ రీకాల్‌ మొదలవుతుందని తెలిపింది. ఇటీవల కాలంలో ఓ కంపెనీ ఈ స్థాయిలో వాహనాలను వెనక్కి రప్పించడం ఇదే తొలిసారి. సోమవారం నాటి ట్రేడింగ్‌లో మారుతీ సుజుకీ షేర్లు బీఎస్‌ఈలో 0.75 శాతం క్షీణించి రూ.9,694.70 వద్ద ముగిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని