3 రోజుల్లో NPS విత్‌డ్రాలు

ఎన్‌పీఎస్ నుంచి నిష్క్ర‌మించే స‌మ‌యంలో నిధుల‌ సెటిల్‌మెంట్ సమయాన్ని త‌గ్గించారు.

Updated : 20 Sep 2022 17:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) విత్‌డ్రా సమయాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) తగ్గించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం (సెప్టెంబ‌రు 20, 2022) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఎన్‌పీఎస్ నుంచి నిష్క్ర‌మించే స‌మ‌యంలో నిధుల‌ను విత్‌డ్రా చేసుకునేందుకు చందాదారులు చేసే అభ్య‌ర్థ‌న‌ల‌ను T+4 పని/సెటిల్‌మెంట్ రోజులలో ప‌రిష్కరించేవారు (ఇక్క‌డ T అనేది విత్‌డ్రా కోసం అభ్య‌ర్థించిన రోజు). ఇప్పుడు ఈ స‌మ‌యాన్ని T+2 కి త‌గ్గించారు. తుది నిష్క్ర‌మ‌ణ ప్రయోజనం పొందే సమయం, సంబంధిత సీఆర్ఏల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.

  • Protean eGov Technologies Ltdతో అనుసంధాన‌మైన‌ చందాదారులు: ఉద‌యం 10 గంట‌ల 30 నిమిషాల లోపు అభ్య‌ర్థిస్తే T+2 ప‌నిదినాల్లో ప‌రిష్క‌రిస్తారు.
  • KFin Technologies Ltd & CAMS CRAలతో అనుసంధాన‌మైన చందాదారులు: ఉదయం 11 గంటల లోపు అభ్య‌ర్థిస్తే T+2 ప‌నిదినాల్లో పరిష్కరిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని