Jio: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో జియో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్స్

Jio prepaid plans with Netflix subscription: నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో లాంచ్‌ చేసింది.

Published : 18 Aug 2023 17:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో (Jio) నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను (prepaid plans) తీసుకొచ్చింది. ప్రస్తుతం జియో ఫైబర్‌, జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లలో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ప్రీపెయిడ్‌ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏ టెలికాం సంస్థా ప్రీపెయిడ్‌ ప్లాన్లలో నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇవ్వలేదని జియో తన ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రీపెయిడ్‌ బండిల్డ్‌ ప్లాన్‌ ద్వారా 40 కోట్ల మంది జియో ప్రీపెయిడ్‌ కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందే ఆప్షన్‌ లభిస్తుందని జియో తెలిపింది. ప్రపంచస్థాయి సేవలను అందించేందుకు జియో కట్టుబడి ఉందని జియో ప్లాట్‌ఫామ్స్‌ సీఈఓ కిరణ్‌ థామస్‌ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌ వంటి కంపెనీలతో భాగస్వామ్యం వల్ల మా సేవలు మరింత బలోపేతం కానున్నాయని తెలిపారు. జియో భాగస్వామ్యంతో తమ కంటెంట్‌ మరింత మందికి చేరుతుందని నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది.

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల కోసం RBI కొత్త పోర్టల్.. వివరాలు ఇలా తెలుసుకోండి..

జియో తీసుకొచ్చిన ప్లాన్లు ఇవే..

  • నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్లను జియో తీసుకొచ్చింది. ఇందులో ఒక ప్లాన్‌ ధర రూ.1099గా నిర్ణయించింది. ఈ ప్లాన్‌ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌ లభిస్తుంది.
  • జియో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.1499. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత కాల్స్‌, రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ (బేసిక్‌) లభిస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద ఉచిత 5జీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.149 కాగా.. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ ప్లాన్‌ ధర నెలకు రూ.199 గా ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని