Galaxy F15 5G: బిగ్‌ బ్యాటరీతో F సిరీస్‌లో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. వివరాలు ఇవే!

Galaxy F15 5G: శాంసంగ్‌ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నాలుగేళ్ల ఓఎస్‌ అప్డేట్స్ వస్తాయి.

Published : 04 Mar 2024 15:21 IST

Galaxy F15 5G | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌.. ఎఫ్‌ సిరీస్‌లో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయంగా విడుదల చేసింది. బిగ్‌ బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఎఫ్‌ 15 (Galaxy F15 5G) పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌ ఫీచర్లేంటి? అమ్మకాలెప్పటినుంచి ప్రారంభమవుతాయి వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎఫ్‌ 15 ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.14,499గా పేర్కొంది.  యాష్‌ బ్లాక్‌, గ్రూవీ వయలెట్‌, జాజీ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ మొబైల్‌ స్టోర్ల నుంచి నేటినుంచే (మార్చి 4న) సాయంత్రం 7 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 

ట్రైన్‌ టికెట్‌ చిరిగిపోయిందా? అయితే ఇలా చేయండి!

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌యూఐ 5తో పనిచేస్తుంది. ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్‌ హామీ ఇస్తోంది. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ + సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో పనిచేస్తుంది. 90 Hz రిఫ్రెష్‌ రేటు ఉంది. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 6100+ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.

వెనకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా ఇచ్చారు. 5+2 ఎంపీ కెమెరాలు కూడా ఉన్నాయి. ముందువైపు 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1టీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. బ్లూటూత్‌ 5.3, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీఐ టైప్‌-సి పోర్ట్‌ ఉన్నాయి. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకత. రెండ్రోజుల పాటు బ్యాకప్‌ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. సింగిల్‌ ఛార్జ్‌తో 25 గంటలు వీడియోలు ప్లే చేయొచ్చని చెబుతోంది. ఛార్జింగ్‌ అడాప్టర్‌ను వేరేగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని