Tesla price cut: చైనాలో 40 శాతం తక్కువ ధరకు టెస్లా కార్లు!
ప్రత్యర్థి సంస్థ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు టెస్లా చైనాలో కార్ల ధరల్ని తగ్గించింది.
బీజింగ్: ప్రపంచంలో అతిపెద్ద విద్యుత్తు వాహన విపణిగా ఉన్న చైనాలో టెస్లా (Tesla) తమ కార్ల ధరలను తగ్గించింది (Tesla Price Cut). ‘మోడల్ 3’, ‘మోడల్ వై’ కార్ల ధరలను మరోసారి తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అలాగే ప్రీమియం విభాగంలో పట్టు పెంచుకునేందుకు కొత్తగా ‘మోడల్ ఎస్’ సెడాన్, ‘మోడల్ ఎక్స్’ను ప్రవేశపెట్టింది.
‘మోడల్ వై’ ఎస్యూవీ ధర 2,88,900 యువాన్ల నుంచి 2,59,900 యువాన్ల (37,875 డాలర్లు)కు టెస్లా తగ్గించింది (Tesla Price Cut). ఈ కారును టెస్లా (Tesla) తొలుత 65,900 డాలర్లతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దాంతో పోలిస్తే ధర ప్రస్తుతం 43 శాతం తగ్గింది. మరోవైపు తాజా తగ్గింపుతో ‘మోడల్ 3’ ధర మొత్తంగా 30 శాతం దిగొచ్చి 2,29,900 యువాన్లకు చేరింది. చైనాలో ఈవీ (Electic Vehicles) రంగంలో పోటీ పెరుగుతోంది. దాన్ని తట్టుకొని మాస్, ప్రీమియం సెగ్మెంట్లలో పట్టు నిలబెట్టుకోవడం కోసమే టెస్లా (Tesla) ధరల తగ్గింపు వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రముఖ మదుపరి వారెన్ బఫెట్ మద్దతు ఉన్న బీవైడీ కంపెనీతో పాటు Xpeng, నియో, పోర్షే ఏజీ, మెర్సిడెస్ బెంజ్ నుంచి టెస్లాకు గట్టి పోటీ ఎదురవుతోంది.
తాజాగా ప్రవేశపెట్టిన ‘మోడల్ ఎస్’లో ఇంటీరియర్‌ను కొత్తగా తీర్చిదిద్దినట్లు టెస్లా తెలిపింది. దీని ధర చైనాలో 7,89,900 యువాన్లుగా పేర్కొంది. మరోవైపు కేవలం 2.1 సెకన్లలోనే 100 కిలోమీటర్ల/గంటకు వేగాన్ని అందుకోగల ప్లెయిడ్ వెర్షన్ ధరను 1.01 మిలియన్ యువాన్లుగా నిర్ణయించింది. అలాగే ‘మోడల్ ఎక్స్’ ఎస్యూవీ ధర 8,89,900 యువాన్లుగా, ప్లెయిడ్ వెర్షన్ ధర 1.04 మిలియన్ యువాన్లుగా పేర్కొంది. చైనాలో మూడు లక్షల యువాన్ల పరిధిలో ఉన్న టెస్లా కార్లకు మంచి ఆదరణ ఉంది. షాంఘైలో ఉన్న తయారీ కేంద్రం నుంచి టెస్లా ఏటా 4,50,000 కార్లను ఉత్పత్తి చేస్తోంది. 2021 జనవరి నుంచి ‘మోడల్ వై’లను కూడా ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తోంది.
2022లో షాంఘై తయారీ కేంద్రం నుంచి టెస్లా 7,10,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా టెస్లా విక్రయాల్లో 54 శాతానికి సమానం. డిసెంబరులో మాత్రం సరఫరా తగ్గింది. గిరాకీ తగ్గడం, పరికరాలను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఉత్పత్తిని నిలిపివేయడమే ఇందుకు కారణం. వరుసగా మూడో త్రైమాసికంలోనూ కార్ల డెలివరీలు అంచనాల కంటే తక్కువగా నమోదయ్యాయని టెస్లా గతవారం ప్రకటించింది. దీంతో మంగళవారం స్టాక్ ధర ఒక్కసారిగా 12 శాతం పతనమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్‌కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్‌లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్‌లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్‌స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్‌లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్‌లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్‌తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్‌లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్‌నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్‌తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్‌బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్‌ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ