Tech Tip: ఇన్‌స్టాలో మీకు నచ్చిన వారు మాత్రమే స్టోరీ చూసేలా..!

Tech Tip: ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసే ఫొటోలు, రీల్స్‌కు మాత్రమే కాకుండా స్టోరీలకు కూడా ప్రైవసీ ఎంచుకొనే సదుపాయం ఉందని మీకు తెలుసా?

Updated : 16 Jan 2024 16:35 IST

Instagram Tech tip | ఇంటర్నెట్‌డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు, రీల్స్‌ పోస్ట్‌ చేస్తుంటాం. స్టోరీలూ పెడుతుంటాం. కొందరు మాత్రం స్టోరీలు పెట్టడానికి సంకోచిస్తుంటారు. గోప్యతను దృష్టిలో పెట్టుకుని వీటిని ఎక్కువగా వినియోగించరు. అయితే, పోస్టుల మాదిరిగానే స్టోరీలకూ ప్రైవసీ ఎంచుకొనే సదుపాయం ఉంది. మిమ్మల్ని ఫాలో అవుతున్న వారిలో కొందరికి స్టోరీ కనిపించకూడదు.. అలాగని వారిని అన్‌ఫాలో చేయకూడదనుకున్న సందర్భంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఇందుకోసం సాధారణంగా వాడే Close Friends లిస్ట్‌ ఆప్షన్‌ కూడా ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు.

  • ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి ఫ్రొఫైల్‌ ఖాతాపై క్లిక్‌ చేయండి.
  • పైన కుడివైపు ఉన్న మూడు గీతల సింబల్‌పై ట్యాప్‌ చేసి ‘Settings and privacy’ ఆప్షన్‌ ఎంచుకోండి.
  • కిందకు స్క్రోల్ చేయగానే ‘Who can see your content’ అనే ట్యాబ్‌లో ‘Hide story and live’ ఆప్షన్‌ను ట్యాప్‌ చేయాలి.
  • వెంటనే మీరు ఫాలో అవుతున్న అకౌంట్‌ జాబితా ప్రత్యక్షమవుతుంది. అందులో స్టోరీ చూడాలనుకున్న వారిని మాత్రమే ఎంచుకుంటే సరిపోతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని